Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs PAK: దవడ పగిలిపోయింది.. మైదానంలోనే కుప్పకూలిన పాక్ క్రికెటర్!

NZ vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం జరుగుతున్న న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-4 తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇదిలా ఉండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిని మూట గట్టుకుంది. న్యూజిలాండ్ పై వరుసగా 13 వన్డే మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. మౌంట్ ముంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరిగిన మూడే వన్డేలో వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించగా.. న్యూజిలాండ్ నిర్ణీత 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలోనే 221 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇదిలా ఉండగా.. మూడో వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ తీవ్రంగా గాయపడ్డాడు. చివరి వన్డేలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో కివీస్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా బంతి నేరుగా ఇమామ్ ఉల్ హక్ హెల్మెట్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడ గాయం కావడంతో అర్థంతరంగా మ్యాచ్ నుంచి రిటైర్డ్ హర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.ఇమామ్ చాలా నొప్పితో బాధపడ్డాడు. మైదానంలోనే వైద్యుడి సహాయం తీసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత ఇమామ్‌ను అంబులెన్స్‌లో మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

NZ vs PAK Pakistan Cricketer Imam-ul-Haq Injured After Ball Hits Helmet

మూడో ఓవర్‌లో జరిగిన సంఘటన
వర్షం కారణంగా ఆట నిలిచిపోయి మళ్లీ ప్రారంభమైన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా మూడో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇమామ్ ఉల్ హక్ విలియం ఓరూర్కే వేసి బంతిని ఆఫ్-సైడ్ వైపు ఆడి సింగిల్ తీసుకోవడానికి పరిగెత్తాడు. అయితే అక్కడ ఉన్న ఫీల్డర్ రనౌట్ చేసేందుకు బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఆ బంతి నేరుగా వెళ్లి ఇమామ్ ఉల్ హక్ హెల్మెట్ ను తాకింది. బంతి తగిలిన తర్వాత పాకిస్థాన్ ఓపెనర్ తన హెల్మెట్ తీసి దవడను పట్టుకున్నాడు. ఈ సంఘటనకు ముందు ఇమామ్ ఉల్ హక్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేశాడు. ఆ ఒక్క పరుగు చేసే సమయంలోనే ఇలా గాయపడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్ జట్టు ఒక మార్పు చేసి నసీమ్ షా స్థానంలో హారిస్ రవూఫ్ కు అవకాశం ఇచ్చింది. అతను మ్యాచ్ లో బాగా రాణించాడు. నిక్ కెల్లీని సింగిల్ డిజిట్ స్కోరుకు ఔట్ చేశాడు.

Story first published: Saturday, April 5, 2025, 13:54 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+