Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs NAM: ఆదిలో తడబడినా.. ఇన్నింగ్స్ చివరలో దుమ్మురేపిన న్యూజిల్యాండ్‌! నమీబియా లక్ష్యం ఎంతంటే?

NZ vs NAM: Glenn Phillips, James Neesham power New Zealand to score 163

షార్జా: పసికూన నమీబియాపై న్యూజిల్యాండ్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఇన్నింగ్స్ ఆదిలో తడబడినా.. చివరలో గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్‌; 21 బంతుల్లో 1 ఫోర్, మూడు సిక్సులు ), జేమ్స్ నీషమ్‌ (35 నాటౌట్‌; 23 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సులు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 163 పరుగులు చేసింది. దాంతో నమీబియా లక్ష్యం 164 పరుగులుగా మారింది. మార్టిన్ గప్తిల్ (18), డారియల్ మిచెల్‌ (19), దేవాన్ కాన్వే (17) విఫలమయ్యారు. ఇక నమీబియా బౌలర్లలో ఎరాస్మస్‌, డేవిడ్ వీజే, ష్కాల్జ్‌ తలో వికెట్ పడగొట్టారు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న న్యూజిలాండ్‌ను భారీ స్కోరు సాధించకుండా నమీబియా బౌలర్లు అడ్డుకున్నారు. అయితే ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో పట్టు సడలించడంతో కివీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిల్యాండ్‌ జట్టును నమీబియా బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (18: ఒక ఫోర్‌, ఒక సిక్స్‌) ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ డారియల్ మిచెల్‌(19: రెండు ఫోర్లు) కూడా స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో కివీస్ డిఫెన్స్‌లో పడింది. ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌(28: రెండు ఫోర్లు, ఒక సిక్స్‌), డెవాన్‌ కాన్వే (17) ఆచితూచి ఆడారు. అయితే విలియమ్సన్‌ను నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కాన్వే రనౌటయ్యాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డు నెమ్మదించింది.

ఈ సమయంలో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39: ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), జేమ్స్ నీషమ్‌ (35: ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు) న్యూజిల్యాండ్‌ జట్టును ఆదుకున్నారు. ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తోనే.. మరోవైపు బౌండరీలు బాదారు. దాంతో నెమ్మదించిన కివీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఫిలిప్స్‌, నీషమ్‌ ఇన్నింగ్స్ చివరివరకు మరో వికెట్ పడనివ్వలేదు. ఈ జోడి 60 పరుగులకు పైగా రన్స్ చేయడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో పట్టు కోల్పోయారు. నమీబియా బౌలర్లలో బెమార్డ్‌, వైజ్‌, ఎరాస్మస్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Story first published: Friday, November 5, 2021, 17:48 [IST]
Other articles published on Nov 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+