Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదేం ఉతుకుడు రా కేన్ మామ - గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో..!!

NZ vs IRE: Kane Williamsons 61 in 35 balls helps New Zealand to set huge target to Ireland

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే విషయంపై ఓ స్పష్టత వస్తుంది.

 లిటిల్ ధాటికి..

లిటిల్ ధాటికి..

ఇవ్వాళ అడిలైడ్ ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న న్యూజిలాండ్-ఐర్లాండ్ మ్యాచ్‌లో మరో హ్యాట్రిక్ నమోదైంది. లెఫ్ట్ హ్యండ్ ఫాస్ట్ బౌలర్ జోషువా లిటిల్.. న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు అనూహ్యంగా బ్రేకులు వేశాడు. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ తీసుకోవడం అతనికి ఇది రెండోసారి. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లోనూ ఇది రెండో హ్యాట్రిక్. ఇదివరకు శ్రీలంకపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ తీసుకున్న విషయం తెలిసిందే.

భారీ స్కోర్ చేస్తుందనినిపించినా..

భారీ స్కోర్ చేస్తుందనినిపించినా..

ఇన్నింగ్ ఆరంభంలో దుమ్ముదులిపిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్.. డెత్ ఓవర్లల్లో కుప్పకూలిపోయింది. ఐర్లాండ్ బౌలింగ్‌కు దాసోహం అయింది. ప్రత్యేకించి- జోషువా లిటిల్.. తన బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 200లకు పైగా స్కోర్ సాధించేలా దూసుకెళ్తోన్న న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు కళ్లెం వేశాడు. ఫలితంగా- ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్దే నిలిచిపోయింది కివీస్ టీమ్ టార్గెట్.

కేన్ దూకుడు..

కేన్ దూకుడు..

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఫిన్ అలెన్- 32, డెవాన్ కాన్వే- 28 పరుగులు చేశారు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తరువాత టచ్‌లోకి వచ్చాడు. సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసే ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లోనే మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.

 హ్యూజ్ స్ట్రైక్ రేట్..

హ్యూజ్ స్ట్రైక్ రేట్..

ఈ స్థాయిలో బ్యాటింగ్ చేసి చాలాకాలమైంది కేన్ విలియమ్సన్‌కు. కరవు తీరా షాట్లు కొట్టాడు. తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 174.28 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు ఈ మ్యాచ్‌లో. కేన్ కొట్టిన మూడు సిక్సర్లల్లో ఒకటి 92 మీటర్ల దూరం వెళ్లి పడిందంటే ఏ రేంజ్‌లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. 19వ ఓవర్ రెండో బంతికి జోషువా లిటిల్ బౌలింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక టైమింగ్ మిస్ అయ్యాడు గానీ.. లేదంటే డెత్ ఓవర్లల్లో ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించేవాడే.

Story first published: Friday, November 4, 2022, 12:08 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+