Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022లో మరో హ్యాట్రిక్ - అనామక బౌలర్ కొత్త రికార్డ్..!!

 NZ vs IRE: Ireland bowler Joshua Little picks 2nd hat-trick of T20 World Cup 2022 against New Zealand

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంటోంది. సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ఒక్కటొక్కటిగా ముగుస్తోన్నాయి. ఎల్లుండితో సూపర్ 12 మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. 9వ తేదీ నుంచి సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. ప్రస్తుతం 12 జట్లు సూపర్ 12లో ఆడుతోన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్ చేరే అవకాశం నాలుగు జట్లకు మాత్రమే లభిస్తుంది. సెమీ ఫైనల్స్ చేరే జట్టు ఏదనే విషయంపై ఓ స్పష్టత వస్తుంది.

 డెత్ ఓవర్లల్లో కొల్లాప్స్..

డెత్ ఓవర్లల్లో కొల్లాప్స్..

ఇవ్వాళ అడిలైడ్ ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న న్యూజిలాండ్-ఐర్లాండ్ మ్యాచ్‌లో మరో హ్యాట్రిక్ నమోదైంది. ఇన్నింగ్ ఆరంభంలో దుమ్ముదులిపిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్.. డెత్ ఓవర్లల్లో కుప్పకూలిపోయింది. ఐర్లాండ్ బౌలింగ్‌కు దాసోహం అయింది. ప్రత్యేకించి- జోషువా లిటిల్.. తన బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 200లకు పైగా స్కోర్ సాధించేలా దూసుకెళ్తోన్న న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు కళ్లెం వేశాడు. ఫలితంగా- ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగుల వద్దే నిలిచిపోయింది కివీస్ టీమ్ టార్గెట్.

బ్యాటర్ల దూకుడు..

బ్యాటర్ల దూకుడు..

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఫిన్ అలెన్- 32, డెవాన్ కాన్వే- 28 పరుగులు చేశారు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తరువాత టచ్‌లోకి వచ్చాడు. సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసే ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లోనే మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్-17 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నాడు. డారిల్ మిఛెల్ 21 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

చివరి ఓవర్లల్లో..

చివరి ఓవర్లల్లో..

ఐర్లాండ్ బౌలర్లల్లో జోషువా లిటిల్- న్యూజిలాండ్ స్కోర్ బోర్డుకు అనూహ్యంగా బ్రేకులు వేశాడు. 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ తీసుకున్నాడీ లెఫ్ట్ హ్యండర్ ఫాస్ట్ బౌలర్. హ్యాట్రిక్ తీసుకోవడం అతనికి ఇది రెండోసారి. రెండో బంతికి కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ పంపించాడు. మిడిల్ స్టంప్ మీద పడి ఇన్ స్వింగ్ అయిన బంతిని డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. గాల్లోకి లేచిన ఆ బంతి నేరుగా డెలానీ చేతుల్లో వాలింది. అప్పటికి న్యూజిలాండ్ స్కోర్ 174 పరుగులు.

డెత్ ఓవర్లల్లో ఫైర్..

డెత్ ఓవర్లల్లో ఫైర్..

అదే ఓవర్ మూడో బంతికి జేమ్స్ నీషమ్ అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్‌‌పై పిచ్ అయిన బంతిని ఆడలేకపోయాడు నీషమ్. అది నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో బంతికి శాంట్నర్ కూడా అదే తరహాలో అవుట్ అయ్యాడు. దీనితో లిటిల్ తన రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి ఐర్లాండ్ బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

Story first published: Friday, November 4, 2022, 11:44 [IST]
Other articles published on Nov 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+