Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs ENG: కేన్ మామకు హార్ట్‌బ్రేక్.. తృటిలో సెంచరీ మిస్!

గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. స్వదేశంలో హాగ్లీ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 93 పరుగుల వద్ద ఔటై శతకాన్ని చేజార్చుకున్నాడు. సెప్టెంబర్‌లో శ్రీలంక పర్యటనలో కేన్ మామ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. రెండు నెలల అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్న విలియమ్సన్ ఇంగ్లండ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

విలియమ్సన్ 197 బంతుల్లో 93 పరుగులు చేశాడు. పది బౌండరీలు బాదాడు. అయితే శతకానికి చేరువలో అట్కిన్సన్ వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమైన కేన్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్రాలే చేతికి చిక్కాడు. గత ఆరేళ్లలో టెస్టుల్లో విలియమ్సన్ 90ల్లో ఔటవ్వడం ఇదే ప్రథమం. 2018 తర్వాత తన 13.. 90+ స్కోర్లు శతకాలుగానే మార్చాడు. కాగా, విలియమ్సన్‌తో పాటు కెప్టెన్ టామ్ లాథమ్ (47; 54 బంతుల్లో, 6 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (41 బ్యాటింగ్; 58 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 83 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.

NZ vs ENG Kane Williamson Falls in Nervous Nineties in a Test for the First Time Since 2018

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన న్యూజిలాండ్‌ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే‌ను (2; 8 బంతుల్లో) అట్కిన్సన్‌ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్‌‌తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర (34; 49 బంతుల్లో, 3 ఫోర్లు), డారిల్ మిచెల్ (19; 47 బంతుల్లో)లతో కలిసి వరుసగా అర్ధశతక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. కాగా, శతకానికి చేరవలో అట్కిన్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

విలియమ్సన్ ఔటైన కాసేపటికే టామ్ బ్లండెల్ (17; 32 బంతుల్లో, 2 ఫోర్లు), నాథన్ స్మిత్ (3; 13 బంతుల్లో) కూడా పెవిలియన్‌కు చేరారు. కానీ టెయిలెండర్స్‌తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ స్కోరుబోర్డును 300ను దాటించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు, గస్ అట్కిన్సన్, బ్రిడన్ కార్స్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ.2 కోట్లతో వచ్చిన కేన్ విలియమ్సన్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, November 28, 2024, 12:17 [IST]
Other articles published on Nov 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+