Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనిషివా? పక్షివా? ఫిలిప్స్ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ (Video)

హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి పర్యాటక జట్టు ఇంగ్లండ్ 74 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. యువ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (132 బ్యాటింగ్; 163 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సర్) అజేయ శతకంతో కదం తొక్కాడు. అతనికి తోడుగా కెప్టెన్ బెన్ స్టోక్స్ (37; 76 బంతుల్లో, 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కివీస్ కంటే ఇంగ్లండ్ 29 పరుగుల వెనుకంజలో ఉంది.

ఓవర్‌నైట్ స్కోరు 319/8తో ఇవాళ ఆట ఆరంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లకు 348 పరుగులకు ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్; 87 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ అర్ధశతకంతో జట్టుకు కీలక పరుగులు అందించాడు. కేన్ విలియమ్సన్ (93; 197 బంతుల్లో, 10 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ టామ్ లాథమ్ (47; 54 బంతుల్లో, 6 ఫోర్లు) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కార్స్, షోయబ్ బషీర్ చెరో నాలుగు వికెట్లు, అట్కిన్సన్ రెండు వికెట్లు తీశారు.

NZ vs ENG Glenn Phillips Stuns with a Spectacular One-Handed Dive to Dismiss Pope
Photo Credit: credits to x

అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఒలీ పోప్ (77; 98 బంతుల్లో, 8 ఫోర్లు) బ్యాక్ వర్డ్ పాయింట్ మీదుగా కట్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ గ్లెన్ ఫిలిప్స్ రెప్పపాటులో పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఫిలిప్స్ అద్భుత క్యాచ్‌తో కుదురుకున్న ఒలీ పోప్ పెవిలియన్‌కు చేరాడు. ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో 151 పరుగుల హ్యారీ బూక్- ఒలీ పోప్ భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌కు వచ్చిన ఆదిలోనే ఓపెనర్ జాక్ క్రాలే (0; 12 బంతుల్లో) వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్లు అదే జోరులో క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. జాకోబ్ బెథెల్ (10; 34 బంతుల్లో, 2 ఫోర్లు), జో రూట్ (0; 4 బంతుల్లో), బెన్ డకెట్ (46; 62 బంతుల్లో, 6 ఫోర్లు) వరుసగా పెవిలియన్‌కు చేరారు. కానీ పోప్-హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇంగ్లండ్‌ను తిరిగి గొప్పగా పోటీలోకి తెచ్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ రెండు వికెట్లు, టిమ్ సౌథి, మ్యాట్ హెన్రీ, ఒరుర్కే తలో వికెట్ తీశారు.

Story first published: Friday, November 29, 2024, 12:46 [IST]
Other articles published on Nov 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+