For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

James Anderson Records: టెస్ట్‌లలో ఆ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా జేమ్స్ అండర్సన్.. దరిదాపుల్లో ఎవరూ లేరు

Nz vs Eng 2nd Test: James Anderson became the first pacer to take 650 wickets in Tests

వెటరన్ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్‌లలో 650 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఇక నాటింగ్‌హామ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు తన మొదటి ఓవర్‌లో అతను న్యూజిలాండ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ రికార్డ్ సాధించాడు. ఇక టెస్ట్‌లలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల లిస్టులో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 టెస్టు వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 708వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

 షేన్ వార్న్‌ను ఆండర్సన్ అధిగమించే అవకాశం

షేన్ వార్న్‌ను ఆండర్సన్ అధిగమించే అవకాశం

ఇక ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 619వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. గ్లెన్ మెక్‌గ్రాత్ 563 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. మరో ఇంగ్లాండ్ ప్లేయర్ స్టువర్ట్ బ్రాడ్ ఇప్పటివరకు 543వికెట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. 39ఏళ్ల అండర్సన్ ప్రస్తుతం ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు కలిగి లేడు. అతను తన కెరీర్లో 700 టెస్ట్ వికెట్ మార్క్‌ను చేరుకోగలిగే అవకాశాలున్నాయి. అలాగే షేన్ వార్న్‌ను దాటి రెండో స్థానానికి చేరుకోగలిగే అవకాశం కూడా ఉంది. ఇక జేమ్స్ అండర్సన్ రికార్డుకు దరిదాపుల్లో ఏ పేసర్ లేడు. బ్రాడ్ 107వికెట్ల వెనకాల ఉన్నాడు.

 ఆండర్సన్ కెరీర్ ముగిసిందంటూ వార్తలు..

ఆండర్సన్ కెరీర్ ముగిసిందంటూ వార్తలు..

39ఏళ్ల ఆండర్సన్ ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్ టూర్‌కు దూరమయ్యాక అతని టెస్ట్ కెరీర్ ముగిసందంటూ వార్తలొచ్చాయి. ఇక మళ్లీ జాతీయ జట్టుకు అతను ఆడడం కష్టమనే ఊహాగానాలు వచ్చాయి. ఇంగ్లాండ్ వెస్టిండీస్‌తో సిరీస్‌ను 0-1తో కోల్పోవడంతో స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ బౌలింగ్ మీద తీవ్ర విమర్శలొచ్చాయి. వీళ్ల పనైపోయిందని విమర్శల పర్వం జోరందుకుంది.

 ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో మార్పులతో మళ్లీ జట్టులోకి ఆండర్సన్

ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో మార్పులతో మళ్లీ జట్టులోకి ఆండర్సన్

అనూహ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో కొన్ని భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జో రూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ స్థానంలో బ్రెండన్ మెకల్లమ్ వచ్చాడు. అలాగే అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మళ్లీ న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టులోకి వచ్చారు. ఇక లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ తుది జట్టులోకి వచ్చిన ఆండర్సన్, బ్రాడ్ ఆ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి ఇంగ్లాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

 డ్రా దిశగా రెండో టెస్ట్

డ్రా దిశగా రెండో టెస్ట్

ఇదిలా ఉండగా రెండో టెస్టులో జో రూట్, ఆలీ పోప్ ఇరువురు సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 539 పరుగులు చేయగలిగింది. తద్వారా న్యూజిలాండ్‌కు కేవలం 14పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్, టామ బ్లండెల్ సెంచరీలతో చెలరేగడంతో 553పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్.. ఆండర్సన్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ కొట్టి కాస్త టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. కానీ జేమ్స్ ఆండర్సన్ తర్వాతి బంతికి అద్భుతమైన ఇన్ స్వింగ్ డెలివరీతో అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతుంది.

Story first published: Monday, June 13, 2022, 19:44 [IST]
Other articles published on Jun 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+