RCB నయా ఆల్‌రౌండర్ సంచలనం.. రికార్డులన్నీ బ్రేక్!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (174*; 275 బంతుల్లో) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి స్థానంలో బ్యాటింగ్‌కు బ్యాటింగ్‌కు వచ్చిన హేజిల్‌వుడ్ (22; 62 బంతుల్లో)తో కలిసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుపై పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.
గ్రీన్ అజేయ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 115.1 ఓవర్లలో 383 పరుగులకు ఆలౌటైంది. 279/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ఇవాళ మరో 104 పరుగులు చేసింది. హేజిల్‌వుడ్‌తో కలిసి గ్రీన్ సాధికారికంగా ఆడాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. కివీస్ బౌలర్లను పరీక్షిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 225 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

అయితే గ్రీన్ క్రీజులో పాతుకపోవడంతో హేజిల్‌వుడ్‌ను అయినా ఔట్ చేయాలనుకున్న కివీస్‌కు అంత సులువుగా ఫలితం దక్కలేదు. గ్రీన్‌కు హేజిల్‌వుడ్ కూడా గొప్పగా సహకరించాడు. కానీ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో మిడ్ ఆఫ్‌లో ఉన్న రచిన్ రవీంద్రకు దొరికిపోయాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న గ్రీన్ డబుల్ సెంచరీ సాధించే అవకాశం లేకపోయాడు. అయినప్పటికీ తన కెరీర్‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కామెరూన్ గ్రీన్ ఆడనున్న విషయం తెలిసిందే. ట్రేడింగ్‌లో ముంబయి ఇండియన్స్ నుంచి గ్రీన్ ఆర్సీబీకి వచ్చాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (40; 39 బంతుల్లో),ఉస్మాన్ ఖవాజా (33; 118 బంతుల్లో), స్టీవ్ స్మిత్ (31; 71 బంతుల్లో), లబుషేన్ (1), ట్రావిస్ హెడ్ (1), అలెక్స్ కేరీ (10), మిచెల్ స్టార్క్ (9), కమిన్స్ (16), నాథన్ లయాన్ (5) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అయిదు వికెట్లు తీశారు. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర ఒక వికెట్ సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications