Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AUS: RCB ప్లేయర్ సెన్సేషనల్ సెంచరీ (Video)

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (103*; 155 బంతుల్లో) శతకంతో సత్తాచాటాడు. 89 పరుగులకు కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన ఆస్ట్రేలియాను గ్రీన్ ఆదుకున్నాడు. 108 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతను మరో 46 బంతుల్లోనే మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్ 16 బౌండరీలు సాధించి అజేయంగా నిలిచాడు.

కామెరూన్ గ్రీన్ పోరాటంతో తొలి రోజు ఆట ముగిసేసరికి 85 ఓవర్లకు ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభమే దక్కింది. స్టీవ్ స్మిత్ (31; 71 బంతుల్లో), ఉస్మాన్ ఖవాజా (33; 118 బంతుల్లో) తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు తీశారు. పేస్ అనుకూలించే పిచ్‌పై చెలరేగారు.

NZ vs AUS: RCB Player Cameron Green hits Sensational Century against New Zealand

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ మార్ష్‌తో కలిసి గ్రీన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మార్ష్ (40; 39 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. వీరిద్దరు అయిదో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. మార్ష్ ఔటైన తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా గ్రీన్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు.బౌండరీలతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. గ్రీన్‌‌తో పాటు హేజిల్ వుడ్ (0) క్రీజులో ఉన్నాడు.

లబుషేన్ (1), ట్రావిస్ హెడ్ (1), అలెక్స్ కేరీ (10), మిచెల్ స్టార్క్ (9), కమిన్స్ (16), నాథన్ లయాన్ (5) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు తీశారు. విలియమ్ ఒరొర్కె, స్కాట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఐపీఎల్‌లో రాయల్ ‌ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కామెరూన్ గ్రీన్ ఆడనున్న విషయం తెలిసిందే. ట్రేడింగ్‌లో ముంబయి ఇండియన్స్ నుంచి గ్రీన్ ఆర్సీబీకి వచ్చాడు.

Story first published: Thursday, February 29, 2024, 12:09 [IST]
Other articles published on Feb 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+