Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AUS: కమిన్స్ ఆల్‌రౌండర్ షో.. ఆస్ట్రేలియా విజయం

క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన ఆఖరి టెస్టులో అలెక్స్ కేరీ (98*; 123 బంతుల్లో), మిచెల్ మార్ష్ (80; 102 బంతుల్లో) అద్భుతంగా పోరాడారు. ఆఖర్లో న్యూజిలాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్యాట్ కమిన్స్ (32*; 44 బంతుల్లో) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఓవర్‌నైట్ స్కోరు 77/4తో ఇవాళ ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. ట్రావిస్ హెడ్ (18; 43 బంతుల్లో)ను సౌథి ఔట్ చేశాడు. 80/5తో ఆసీస్ కష్టాల్లో పడింది. విజయానికి ఆస్ట్రేలియా‌కు మరో 199 పరుగులు అవసరం. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ కేరీతో కలిసి మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ కేరీ, మార్ష్ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

NZ vs AUS Pat Cummins all-rounder show helped Australia win against New Zealand

అయితే బెన్ సీర్స్ వరుస బంతుల్లో మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ (0; 1 బంతుల్లో)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. కానీ ఆస్ట్రేలియా విజయానికి 59 పరుగులు పరుగులమవ్వగా క్రీజులోకి వచ్చిన కమిన్స్ దూకుడుగా ఆడాడు. నాలుగు బౌండరీలు సాధించాడు. న్యూజిలాండ్‌ అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తొందగా ముగించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 162 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ టామ్ లాథమ్ (38; 69 బంతుల్లో) టాప్ స్కోరర్. హేజిల్‌వుడ్ అయిదు వికెట్లు సాధించాడు.అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. లబుషేన్ (90; 147 బంతుల్లో) సెంచరీ చేజార్చుకున్నాడు. మ్యాట్ హెన్రీ ఏడు వికెట్లతో సత్తాచాటాడు.
రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 372 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (82; 107 బంతుల్లో) టాప్ స్కోరర్. కమిన్స్ నాలుగు వికెట్లు సాధించాడు. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 65 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెన్ సీర్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, March 11, 2024, 9:45 [IST]
Other articles published on Mar 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+