Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఫిలిప్స్ (Video)

వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అరుదైన రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్‌ (71; 70 బంతుల్లో)తో అలరించిన ఫిలిప్స్ తర్వాత బంతితో చెలరేగాడు. 16 ఓవరల్లో 45 పరుగులిచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రికార్డులు బ్రేక్ చేశాడు.

టెస్టుల్లో గత 18 ఏళ్లలో స్వదేశంలో ఓ ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు సాధించిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా ఫిలిప్స్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు సాధించి ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు 2008లో వెస్టిండీస్‌పై డేనియట్ వెటోరీ అయిదు వికెట్లు సాధించడమే స్వదేశంలో న్యూజిలాండ్ స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన.

NZ vs AUS: Glenn Phillips first New Zealand spinner to pick up a five-for at home in 18 years

ఓవరాల్ స్వదేశంలో న్యూజిలాండ్ స్పిన్నర్ల అత్యుత్తమ ప్రదర్శన జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ ఏడో స్థానంలో ఉన్నాడు. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై వెటోరీ ఏడు వికెట్లు సాధించడం అత్యుత్తమం. కాగా, ఫిలిప్స్ ధాటికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 13/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఏ దశలోనూ సత్తాచాటలేకపోయారు. 37 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయారు.

నైట్ వాచ్‌మన్‌గా శుక్రవారం ఆట ముగింపు సమయానికి వచ్చిన నాథన్ లయాన్ (41; 46 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో కామెరూన్ గ్రీన్ (34; 80 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. ట్రావిస్ హెడ్ (29; 36 బంతుల్లో), ఉస్మాన్ ఖవాజా (28; 69 బంతుల్లో), మిచెల్ స్టార్క్ (12; 27 బంతుల్లో) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్ అయిదు వికెట్లు, మ్యాట్ హెన్రీ మూడు, సౌథీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియా 369 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 383, న్యూజిలాండ్ 179 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, March 2, 2024, 9:56 [IST]
Other articles published on Mar 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+