Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాయింట్లన్నీ తార్‌మార్ టక్కర్‌మార్: వర్షం ఏ జట్టును ముంచుతుందో గానీ - మరో మ్యాచ్ గంగపాలు

 NZ vs AFG: New Zealand vs Afghanistan match has been abandoned due to rain without a ball bowled

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌ను వర్షం దెబ్బ కొడుతోంది. అలంటిలాంటి దెబ్బ కాదు. ప్రధాన జట్లన్నీ గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా ఓడిపోతోన్నాయి. తమ ఖాతాలో వచ్చి పడాల్సిన పాయింట్లను కళ్ల ముందే కోల్పోతోన్నాయి. ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటోన్నాయి విన్నింగ్ హార్సెస్. ఫలితంగా- పాయింట్ల పట్టికలో ఆయా జట్లన్నీ ఎక్కడో నిలుస్తోన్నాయి. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి నెట్ రన్‌రేట్ మీద పూర్తిగా ఆధార పడాల్సి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 దక్షిణాఫ్రికాపై దెబ్బ..

దక్షిణాఫ్రికాపై దెబ్బ..

ఇదివరకు దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గెలుపు అంచుల్లో ఉన్న సమయంలో వర్షం దెబ్బ కొట్టింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన మ్యాచ్ అది. హోబర్ట్ స్టేడియం దీనికి వేదిక. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత తొమ్మిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మూడు ఓవర్లల్లోనే 51 పరుగులు చేసింది. గెలుపు వాకిట నిలిచిన సమయంలో భారీ వర్షం కురవడంతో రద్దయింది.

ఇంగ్లాండ్ పాలిట విలన్‌గా..

ఇంగ్లాండ్ పాలిట విలన్‌గా..

ఇవ్వాళ కూడా అదే పరిస్థితి. ఇంగ్లాండ్ పాలిట వర్షం విలన్‌గా మారింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఐర్లాండ్ చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లల్లో 157 పరుగులకు ఆలౌట్ అయింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్రస్థానానికి వర్షం అడ్డు పడింది. 33 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన దశలో వర్షం పడింది. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దయింది.

డక్‌వర్త్ లూయిస్..

డక్‌వర్త్ లూయిస్..

డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం- ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలవాలంటే 110 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లాండ్ ప్రస్థానం 105 వద్దే నిలిచిపోయింది. 14.3 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అది చాలలేదు. అక్కడితో ఆగలేదు. న్యూజిలాండ్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌నూ దెబ్బ కొట్టింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్ రద్దయింది.

ఆఫ్ఘన్‌తో పాయింట్ల పంపకం..

ఆఫ్ఘన్‌తో పాయింట్ల పంపకం..

ఫలితంగా- పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది న్యూజిలాండ్‌కు. తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చితగ్గొట్టి- ఫుల్ జోష్ మీదున్న న్యూజిలాండ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌పైనా గెలుస్తుందనే అంచనాలే ఉన్నాయి. వరుణుడు అడ్డుపడకుండా.. ఈ మ్యాచ్ గనక కొనసాగి ఉంటే కేన్ విలియమ్సన్ సేన తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకునేదేననడంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పుడా పరిస్థితి లేదు.

Story first published: Wednesday, October 26, 2022, 17:16 [IST]
Other articles published on Oct 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+