Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

New Zealand Tour of India: హార్దిక్ పాండ్యాపై వేటు.. ఆ కోల్‌కతా స్టార్‌కు చోటు!!

NZ Tour Of IND: BCCI Not Happy With Hardik Pandya Fitness Asks Selection Committee To Take A Look

ముంబై: టీ20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. బ్యాటర్లు, బౌలర్లు తేలిపోవడంతో కోహ్లీసేన ఓటములను ఎదుర్కొంది. అఫ్గాన్‌పై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌.. టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఈ క్రమంలో ఈరోజు మరికొద్దిసేపట్లో నమీబియాతో ఆరంభం కానున్న మ్యాచ్ నామమాత్రమే కానుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు స్వదేశానికి తిరిగిరానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌తో భారత్ వరుస సిరీస్‌లతో బిజీగా గడుపనుంది. న్యూజిలాండ్‌ జట్టుతో ఈ నెలలో ఆరంభం కానున్న సిరీసుకు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రపంచకప్ 2021లో విఫలమయిన ఆటగాళ్లపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.

పాండ్యా ఔట్:

పాండ్యా ఔట్:

దాదాపు ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. నవంబరు 17 నుంచి డిసెంబరు 7 వరకు టీ20, టెస్టు సిరీస్‌లలో పాల్గొననుంది. ఈ పర్యటనను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. టీ20 ప్రపంచకప్ 2021లో విఫలమయిన ఆటగాళ్లపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. అందరికంటే ముందుగా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాను తుది జట్టు నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది. గాయపడిన ఆటగాళ్లను ఎలా జట్టులోకి తీసుకుంటారని బీసీసీఐ ఓ నివేదిక అడగనుందట. 'ఖచ్చితంగా సెలక్షన్ కమిటీ మరియు టీమ్ మేనేజ్‌మెంట్ నివేదికను సమర్పించమని అడుగుతాము. ఇందులో హార్దిక్ పాండ్యా పేరు ఉంటుంది' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో చెప్పారు.

 అయ్యర్‌కు అవకాశం:

అయ్యర్‌కు అవకాశం:

గాయపడిన హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ 2021లో ఆడుతున్నాడు. అయితే అతను బౌలింగ్ చేయకపోవడంతో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్‌ జట్లపై ఆడిన భారత తుది జట్టులో సమతుల్యత కొరవడింది. మరోవైపు గాయం బారిన పడిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా రాణించలేదు. దాంతో గాయపడినప్పటికీ హార్దిక్, చక్రవర్తిని ఎందుకు ఎంపిక చేశారనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ మరియు సెలక్షన్ కమిటీ నుంచి బీసీసీఐ నివేదిక కోరుతోంది. ఈ నేపథ్యంలో హార్దిక్ న్యూజిలాండ్‌ సిరీసుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడి స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్‌ వెంకటేష్ అయ్యర్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయ్యర్ దేశవాళీ సహా ఐపీఎల్ 2021లో రాణించిన విషయం తెలిసిందే.

 సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలి:

సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కావాలి:

'టీ20 ప్రపంచకప్ 2021కు ఎంపికయిన ఆటగాళ్లకు ఐపీఎల్‌ 2021 ఆడకుండా విశ్రాంతి ఇవ్వాలని సూచించాం. దానిని బీసీసీఐ సెలెక్టర్లు సరిగ్గా పాటించలేదు. హార్దిక్‌ పాండ్యాను ఎన్‌సీఏకు పంపించి ఉండాల్సింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఆడాల్సి ఉండకూడదు. ఆ వైఫల్యం తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ జట్టుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. కేవలం ఒకటి లేదా ఇద్దరు సీమ్ ఆల్‌రౌండర్‌ల గురించి మాత్రమే కాదు. హార్దిక్ స్థానంలో మా వద్ద ఎలాంటి బ్యాకప్ లేదు. అది చాలా ఆందోళన కలిగిస్తుంది. హార్దిక్ కోలుకునే వరకు మేము వేచి ఉండలేము. మాకు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ల అవసరం ఉంది. రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరియు సెలక్షన్ కమిటీకి ఇది తెలుసు. సెలెక్టర్లు ముస్తాక్ అలీలో ఆల్‌రౌండర్‌ కోసం ప్రయత్నిస్తారు' అని సదరు బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

 న్యూజిలాండ్‌ పర్యటన:

న్యూజిలాండ్‌ పర్యటన:

# మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌

# రెండో టీ20- నవంబరు 19, రాంచి

# మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా

# మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌

# రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబై

Story first published: Monday, November 8, 2021, 19:06 [IST]
Other articles published on Nov 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+