డన్: ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన జాబితాలోకి న్యూజిలాండ్ టీనేజర్ గ్లెన్ ఫిలిప్స్ చేరాడు. అంతేకాదు ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్లో రికార్డులను సృష్టించాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తరఫున బరిలోకిదిగిన గ్లెన్ ఫిలిప్స్.. డ్యూక్ ఆఫ్ నార్ఫోల్క్ లెవెన్‌తో గత వారాంతంలో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు సాధించాడు.
1895 నుంచి క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న పశ్చిమ ససెక్స్‌లోని అరుండేల్ క్రికెట్ మైదానంలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా 19 ఏళ్ల గ్లెన్ ఫిలిప్స్ రికార్డు సాధించాడు. ఫిలిప్స్ 123 బంతుల్లో 25 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 201 పరుగులు సాధించాడు.
అంతేకాదు ఈ మ్యాచ్‌లో అతను నాటౌట్‌గా నిలవడం విశేషం. దీంతో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ తమ ఇన్నింగ్స్‌ను 299/5 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ను ప్రారంభించిన డ్యూక్ ఆఫ్ నార్ఫోల్క్ లెవెన్ ఆట చివరికి 174/7 చేసింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.