లండన్: టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత క్రికెట్ జట్టును ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో ఓడించడం సులభమేనని న్యూజిలాండ్ మాజీ కేప్టెన్, లెజెండరీ స్పిన్ బౌలర్ డేనియల్ వెటోరీ అభిప్రాయపడ్డారు. దీనికోసం న్యూజిలాండ్ విధ్వంసక ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుందని అన్నారు. తొలి పది ఓవర్లలో వీలైనంత భారీ స్కోరును చేయడం ద్వారా టీమిండియా బౌలర్లపై ఒత్తిడిని తీసుకుని రావచ్చని చెప్పారు. ఎలాంటి కొమ్ములు తిరిగిన జట్టయినా.. ఒక్కసారి ఒత్తిడిలో పడితే- తేరుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. ఆ సమయంలోనే మరిన్ని పరుగులను పిండుకోవాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఓపెనర్ల పాత్ర కీలకమని చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మేగజైన్లో ఆయన ఓ కాలమ్ రాశారు.
విధ్వంసక ఓపెనింగ్ అవసరం..
మొదట బ్యాటింగ్ చేసినా లేదా, లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగాల్సి వచ్చినా.. తొలి పది ఓవర్లలో అసాధారణ షాట్లను ఆడాలని సూచించారు. అదే విధంగా- న్యూజిలాండ్ బౌలర్లు తొలి పది ఓవర్లలో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుందని అన్నారు. తొలి పది ఓవర్లలో వికెట్లను పడగొట్టడం వల్ల భారత బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి పెంచవచ్చని చెప్పారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్టిల్ బ్యాటింగ్ సామర్థ్యంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని వెటోరీ అన్నారు. గతంలో పలు ఇన్నింగుల్లో విఫలమైనప్పటికీ.. కీలక మ్యాచ్‌లల్లో అతను అద్భుతంగా రాణించాడని, తొలి సెమీస్‌లో కూడా అదే పునరావతృతం అవుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. శ్రీలంకతో మ్యాచ్‌లో అర్ధసెంచరీని సాధించిన విషయాన్ని విస్మరించకూడదని వెటోరీ అన్నారు.
ఇంగ్లండ్ అడుగు జాడల్లో..
రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో టీమిండియాపై ఇంగ్లండ్ ఎలా విధ్వంసకరంగా ఇన్నింగ్‌ను ఆరంభించిందో అందరికీ తెలుసునని, అదే విధమైన బ్యాటింగ్‌ను న్యూజిలాండర్లు కూడా అనుసరించాలని సూచించారు. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటిదాకా న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరును నమోదు చేయలేదని, టీమిండియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆ లోటు భర్తీ అవుతుందని తానుఆశిస్తున్నట్లు వెటోరీ చెప్పారు. టీమిండియా బ్యాట్స్మెన్ల బలాలు, బలహీనతలు ట్రెంట్ బౌల్ట్‌కు బాగా తెలుసని, ఈ మ్యాచ్‌లో అతను కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు.
{headtohead_cricket_3_4}