ఇంగ్లాండ్‌తో.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన శ్రీకాంత్..!!

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ గడ్డపై మెరవనుంది టీమిండియా. ఈ సందర్భంగా జట్టులోకి కొత్తగా అవకాశం దక్కిన ఆటగాళ్లతో పాటు.. అంతకుముందు రాణించిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటామంటూ సీనియర్లు సైతం ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. గతంలో విదర్భ పేసర్ శ్రీకాంత్ వాఘ్ ఇంగ్లాండ్ గడ్డ మీద సంచలన ప్రదర్శన చేశాడు.
స్టోక్‌స్లే క్లబ్ తరఫున బరిలో దిగిన శ్రీకాంత్ పది వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. గతంలో భారత్-ఏ తరఫున ఆడిన శ్రీకాంత్ నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ దుర్హమ్ (ఎన్‌వైఎస్‌డీ) క్రికెట్ లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. మిడిల్స్‌బ్రో సీసీ జట్టుపై 11.4 ఓవర్లలో 39 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. దీంతో స్టోక్స్‌స్లే జట్టు 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అతడు పది నోబాల్స్ విసరడం గమనార్హం.
రింగుల జుట్టుతో ఇర్ఫాన్ పఠాన్‌ను తలపించే శ్రీకాంత్ వాఘ్ 63 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 161 వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్‌లాగే బ్యాటింగ్ కూడా చేయగల సామర్థ్యం ఇతడి సొంతం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 23.71 సగటుతో 1589 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 44 టీ20 మ్యాచ్‌లు ఆడిన శ్రీకాంత్ 51 వికెట్లు తీశాడు.
ఎన్‌వైఎస్‌డీ లీగ్‌లో 11.49 యావరేజ్‌తో 33 వికెట్లు తీసిన శ్రీకాంత్ టాప్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్, పుణే వారియర్స్ జట్ల తరఫున బరిలో దిగాడు. 2011లో చివరిసారిగా అతడు ఐపీఎల్ ఆడాడు. గత కొన్నేళ్లుగా గాయాలతో సతమతమైన శ్రీకాంత్.. పునరాగమనంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications