Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ 2018 సీజన్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్?

NTR Is Brand Ambassador For IPL 11 Season

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటి. వచ్చే ఐదేళ్ల కాలానికి గాను రూ. 16వేల కోట్లకు పైగా చెల్లించి ఐపీఎల్ ప్రసార హక్కుల్ని స్టార్ స్పోర్ట్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ నెట్‌వర్క్‌కు తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఛానెళ్లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2018 సీజన్‌కు గాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్‌ను నియమించుకోవాలని స్టార్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టార్ మా ఆధ్వర్యంలో తెలుగులో వచ్చిన బిగ్‌బాస్ తొలి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహారించడంతో ఈ షో సక్సెస్ అయింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను మరోసారి ఉపయోగించుకొని తెలుగు అభిమానులకు ఐపీఎల్‌ను మరింత చేరువచేసేలా స్టార్ నెట్‌వర్క్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 2018 సీజన్‌కు ఎన్టీఆర్‌ను స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్టార్ మా టీమ్ త్వరలో ఎన్టీఆర్‌తో మ్యాచ్‌లకు సంబంధించి ప్రోమోలు కూడా షూట్ చేసి.. లీగ్ ఆరంభానికి ముందు వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ ప్రోమోలను స్టార్ మాలో ప్రసారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఏప్రిల్ 7న నిర్వహించనున్నారు. ఆరంభ వేడుకల అనంతరం డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆరంభ వేడుకలకు ఎనిమిది జట్లకు చెందిన కెప్టెన్లు హాజరు కావడం లేదు.

Story first published: Tuesday, March 27, 2018, 12:07 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+