Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: సచిన్, గంగూలీల తర్వాత విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: పుట్‌బాల్‌కి భారత్‌లో ఎక్కువ ప్రచారం కలిపించే భాగంలో ఇండియన్ సూపర్ లీగ్ పేరిట ఓ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సూపర్ లీగ్‌లో మొత్తం 8 జట్లు ఉన్నాయి. మాజీ క్రికెట్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ ఇందులో రెండు జట్లకు యజమానులుగా ఉన్నారు.

ఐతే ఇప్పుడు వీరి బాటలో మరో క్రికెటర్ చేరిపోయాడు. విరాట్ కోహ్లీ.. ఎఫ్‌సి గోవా ప్రాంఛైజీకి సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా తెలిపారు. ముంబైలో టీమ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ "ఇది తీసుకున్న వాళ్లలో నేనే కుర్రవాడిని, నాకు పుట్ బాట్ అంటే ఇష్టం ఇండియాలో పుట్‌బాల్‌ పెరగాలి" అని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Now, Virat Kohli owns a football team in ISL

"ఇండియన్ సూపర్ లీగ్ ద్వారా భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ మహామహుల ఆటగాళ్లతో ఆడే అవకాశం లభిస్తుంది" అని అన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సహా యజమాని కాగా, అథ్లెటిక్ డీ కోల్ కత్తా జట్టుకు సౌరభ్ గంగూలీ సహా యజమానిగా ఉన్నారు.

ఇక ఎఫ్‌సి గోవా ప్రాంఛైజీకి కోచ్‌గా బ్రెజిలియన్ లెజెండ్ జికో ఉన్నారు. ఈయన ముద్దు పేరు 'వైట్ పీలే'. గోవా జట్టులో ప్రాన్స్‌కు చెందిన లెజెండ్ ఆటగాడు రాబర్ట్ పైర్స్ ఆడనున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+