Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్

Novak Djokovic: సెర్బియా దిగ్గజం నొవాద్ జకోవిచ్ తనదైన స్టైల్లో టెన్నిస్ చరిత్రలో ఓ అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో లొరెంజో ముసెట్టిని ఓడించి తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను సాధించడం ద్వారా ఈ అద్భుత ఘనతను అందుకున్నాడు. ఈ టైటిల్ గెలుపు జకోవిచ్‌కు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు.. టెన్నిస్ ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచింది. ఇది జకోవిచ్ కెరీర్‌లో 72వ హార్డ్ కోర్ట్ టైటిల్ అంతకుముందు స్విట్జర్లాండ్‌కు చెందిన లెజెండ్ రోజర్ ఫెదరర్ పేరిట అత్యధికంగా 71 హార్డ్ కోర్ట్ టైటిల్స్ రికార్డు ఉండేది. ఈ విజయం ద్వారా జొకోవిచ్ ఆ రికార్డును బద్దలు కొట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటగాడిగా 72 హార్డ్ కోర్ట్ టైటిల్స్ సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధిక హార్డ్ కోర్ట్ టైటిల్స్
*నొవాక్ జకోవిచ్-72
*రోజర్ ఫెదరర్-71
*ఆండ్రీ అగస్సీ-46

Novak Djokovic Creates History Wins Record 72nd Hard Court Title and 101st ATP Trophy

హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
లొరెంజో ముసెట్టితో జరిగిన ఫైనల్ మ్యాచ్ జకోవిచ్‌కు అంత సులభంగా దక్కలేదు. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో జకోవిచ్ తన అనుభవాన్ని, పట్టుదలను ప్రదర్శించాడు. తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన జకోవిచ్, రెండో సెట్‌లో 6-3తో పుంజుకున్నాడు. నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ నడిచింది. ఈ సెట్‌లో రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయినప్పటికీ జకోవిచ్ చివరికి తన పట్టుదలతో 7-5 తేడాతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

రికార్డుల రారాజు
38 ఏళ్ల 5 నెలల వయసులో ATP టైటిల్ గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా కూడా జకోవిచ్ నిలిచాడు. 1977లో కెన్ రోస్‌వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జొకోవిచ్.

*అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్- 24
*గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు-37
*గ్రాండ్‌స్లామ్ సెమీ-ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు-53
*గ్రాండ్‌స్లామ్ క్వార్టర్-ఫైనల్స్‌లో అత్యధిక ప్రదర్శనలు- 64
*ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డు టైటిల్స్- 10 (ఇవి హార్డ్ కోర్ట్ టైటిల్స్‌లో భాగం)
*మొత్తం ATP కెరీర్ టైటిల్స్: 101 (ఇది పురుషుల టెన్నిస్ చరిత్రలో 11వ అత్యధిక సంఖ్య).

Story first published: Sunday, November 9, 2025, 12:54 [IST]
Other articles published on Nov 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+