న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో టెస్టు సిరిస్: 'కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించలేదు'

Nothing wrong with Virat Kohlis aggression, India giving it back under his leadership: Viv Richards

హైదరాబాద్: పెర్త్ వేదికగ ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతిగా సంబరాలు చేసుకోవడంపై ఆసీస్ మీడియా, ఆసీస్ మాజీలు కోహ్లీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా... డెన్నిస్ లిల్లీ, డారెన్ లీమన్, అలెన్ బోర్డర్ లాంటి మాజీలు మాత్రం విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచారు.

అంతర్గత వివాదం ముదురుతోందా?: వినోద్ రాయ్‌కి ఎడుల్జీ ఈ-మెయిల్‌అంతర్గత వివాదం ముదురుతోందా?: వినోద్ రాయ్‌కి ఎడుల్జీ ఈ-మెయిల్‌

పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో భాగంగా కోహ్లీకి, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌కు మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ అమర్యాదగా ప్రవర్తించాడని మిచెల్ జాన్సన్ లాంటి ఆస్ట్రేలియా మాజీలు ఆరోపిస్తున్న సమయంలో... ఈ పరిణామాలన్నింటిపై వెస్టిండీస్‌ మాజీ క్రికెట్ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ స్పందించారు.

టీమిండియా 70, 80ల నాటి కాలం మాదిరిగా లేదు

టీమిండియా 70, 80ల నాటి కాలం మాదిరిగా లేదు

"టీమిండియా 70, 80ల నాటి కాలం మాదిరిగా లేదు. విరాట్‌ కోహ్లీ లాంటి క్రికెటర్‌ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. అతడి దూకుడును చూసి నేనెంతో ముచ్చటపడతాను. కెప్టెన్‌గా దూకుడు ఎందుకుండకూడదు?. ఓ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించే వ్యక్తికి అలాంటి లక్షణం ఉండాలి. లేకపోతే పోటీతత్వం తగ్గిపోతుంది" అని అన్నాడు.

అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించలేదు

అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించలేదు

"విరాట్ కోహ్లీకి దూకుడెక్కువని విన్నా. కానీ అతడు ఎక్కడా అమర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించలేదు. కోహ్లీలో కష్టపడే తత్వం ఎక్కువ. దానినే అందరూ దూకుడు, పొగరు అనుకుంటారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. కోహ్లీ లాంటి కెప్టెన్ ఉండటం వల్లే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మంచి స్థానం దక్కించుకుంది" అని రిచర్డ్స్ అన్నాడు.

 ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువ

ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువ

"ఇక, టెస్టు సిరీస్‌ విషయానికొస్తే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రెండు టెస్టులూ గెలవడానికి టీమిండియాకు అంతకంటే ఎక్కువ అవకాశాలు ముందున్నాయి. వీటిని కోహ్లీసేన ఉపయోగించుకుంటుందని అనుకుంటున్నా" అని వివ్ రిచర్డ్స్ పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా జరగనుంది.

{cricket_304-2018_43624}

1
43624
Story first published: Saturday, December 22, 2018, 14:55 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X