For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Player of Month: ప్చ్.. మనోడికి మిస్.. విజేత ఎవరంటే?

ఐసీసీ.. జనవరి నెలకుగానూ మెన్స్, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ నెలకుగానూ అవార్డుకు నామినేట్ అయిన వరుణ్ చక్రవర్తికి నిరాశ ఎదురైంది. అతడికి ఈ అవార్డు వరించలేదు. వెస్టిండీస్ జోమెల్ వర్రికేన్, ఆస్ట్రేలియా బెత్ మూనీ ఈ అవార్డులను గెలుచుకున్నారు. 1990 తర్వాత టెస్టులో తొలిసారి పాకిస్థాన్ పై వెస్టిండీస్ విజయం సాధించడంలో వర్రికేన్ కీలకంగా వ్యవహరించాడు. అలానే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించడంలో మూనీ కూడా కీలక పాత్ర పోషించింది. ఇందుకుగానూ వీరిద్దరికీ ఈ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు లభించింది.

రెండు టెస్టుల్లో 19 వికెట్లతో..
వర్రికేన్ కు ఇదే తొలి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కావడం విశేషం. ఈ అవార్డు కు నామినేట్ అయిన పాకిస్థాన్ స్పిన్నర్ నొమన్ అలీ, టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పోటీ పడి మరీ దీన్ని గెలుచుకున్నాడు. జనవరి నెలలో పాకిస్థాన్ తో జరిగిన రెండు టెస్ట్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు వర్రీకేన్. మొత్తంగా ఈ సిరీస్‌లో తన అసాధారణమైన ప్రదర్శనతో కేవలం 9 సగటుతో 19 వికెట్లు తీశాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసి 69 పరుగులు ఇచ్చిన అతడు, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి కేవలం 32 పరుగులు సమర్పించుకున్నాడు. రెండు టెస్ట్ లో బంతితో పాటు బ్యాట్ తోనూ అలరించాడు. తొమ్మిదో స్థానంలో క్రీజులోకి వచ్చి అజేయ 36 పరుగులు చేశాడు. బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో 43/4, రెండో ఇన్నింగ్స్ లో 27/5 నమోదు చేశాడు. మొత్తంగా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు.

Not varun chakravarthy Jomel Warrican Beth Mooney wins ICC Player of the Month award

దూకుడు ప్రదర్శనతో అగ్రస్థానానికి
వికెట్‌కీపర్‌ కమ్ బ్యాటర్‌ బెత్‌ మూనీ ఇంగ్లాండ్ తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్‌ సిరీస్‌లో అదిరే ప్రదర్శన చేసింది. ఈ సిరీస్ లోని టీ20 మ్యాచ్‌ల్లో తన దూకుడు ప్రదర్శనతో 75, 44, 94 *‌ రన్స్ సాయంతో మొత్తం 146.89 స్ట్రైక్ రేట్ తో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా ‌ టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయగలిగింది. ఈ అద్భుత ‍ప్రదర్శనతో టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి ఎగబాకింది.

వరుణ్ చక్రవర్తికి మిస్..
టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి రీసెంట్ గా టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం విశేషం. ఈ ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి కూడా సంపాదించుకున్నాడు. దీంతో జనవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ మంత్ రేసులో నిలిచాడు కానీ గెలవలేకపోయాడు.

Story first published: Tuesday, February 11, 2025, 15:50 [IST]
Other articles published on Feb 11, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+