
సనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఈ సీఏఏపై గంగూలీ కుమార్తె సనా గంగూలీ కూడా స్పందించారు. సనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ రాసిన 'ది ఎండ్ ఆఫ్ ఇండియా' నవలలోని సారాంశాన్ని పోస్ట్ చేశారు.

వివాదానికి చోటు
అంతేకాదు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జ్, పౌరసత్వ చట్ట సవరణను సనా గంగూలీ పరోక్షంగా వ్యతిరేకించారు. అయితే సనా పోస్టును కొందరు సమర్దిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక సనా చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కాస్తా వివాదానికి దారితీస్తుండటంతో గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సనా చిన్న పిల్ల, ఆమె చేసిన పోస్ట్ నిజం కాదు అని పేర్కొన్నారు.
వదిలేయండి ప్లీజ్
'దయచేసి ఈ వివాదాల నుంచి నా కూతురు సనాను దూరంగా ఉంచండి. ఆ పోస్ట్ నిజం కాదు. తను చాలా చిన్న పిల్ల. రాజకీయాల గురించి ఇప్పుడే తెలుసుకోలేదు' అని దాదా ట్వీట్ చేశారు. అక్టోబర్ 23న దాదా బీసీసీఐ అధ్యక్షుడు అయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు ప్రెసిడెంట్‌గా సౌరవ్ గంగూలీ క్రికెట్‌లో ఎన్నో సరికొత్త సంస్కరణలను తీసుకురావడంతో కీలకపాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












