
హైదరాబాద్ : సుదూర ప్రేమాయాణం తర్వాత వివాహ బంధంతో ఒకటైన ప్రేమజంటల్లో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ చేరిపోయారు. వీళ్ల పెళ్లి అనంతరం శుభాకాంక్షలు వెల్లువల్లా వస్తున్నాయి. ట్వీట్ రూపంలో వారిని పెళ్లిని బహిర్గతం చేయగా మళ్లీ ట్వీట్ల రూపంలోనే శుభాకాంక్షలు వస్తున్నాయి. వీరిద్దరిని విష్ చేసేందుకు గల్లీ స్థాయి అభిమాని దగ్గర్నుంచి ఢిల్లీ దాకా స్పందించారు.
అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు, విమర్శకులు అందరూ తమ తమ శైలీలో శుభాకాంక్షలు పంపుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనే అనుష్క శర్మకు గానీ, విరాట్ కోహ్లీకి గానీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కారణం లేకపోలేదు. కొద్ది రోజుల క్రితం దీపికాకు అనుష్కకు మనస్ఫర్ధలు వచ్చాయి. అయితే ఇదే కారణంతో దీపికా శుభాకాంక్షలు తెలపలేదనే రూమర్లు కూడా లేకపోలేదు.
ఇదిలా ఉంటే, పద్మావతి సినిమా కోసం వెయిట్ చేస్తున్న దీపికా ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న రణవీర్ సింగ్ తో కలిసి ఓ పుష్పగుచ్చాన్ని పంపిందట. దాంతోపాటు ఓ అందమైన బహుమతిని కూడా పంపినట్లు సమాచారం. అందరిలా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపకుండా ప్రత్యేకంగా ఉండాలన్నట్లు ఇలా చేసింది అంటూ దీపికా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.