
భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం మూడో వన్డే జరగనుంది. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం ప్రాక్టీస్ తర్వాత రహానే మీడియాతో మాట్లాడాడు. తన భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదని టీమిండియా బ్యాట్స్‌మెన్ రహానే అన్నాడు.

ధావన్ పునరాగమనం చేస్తే పరిస్థితిపై
తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అత్యుత్తమ ప్రదర్శన చేయడమే తన పని అని చెప్పుకొచ్చాడు. తన భవిష్యత్తు గురించి, ధావన్ పునరాగమనం చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించాడు. 'భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే నా పని' అని చెప్పాడు.

ప్రతిసారీ సెంచరీలే చేయాల్సిన పని లేదు
'నేనెప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తా. ధావన్ తిరిగొస్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు. జట్టు కోసం నాకిచ్చిన బాధ్యతలు నిర్వర్తించడమే నా పని. నా వరకు నాకు జట్టు కోసం కష్టపడడమే ఇష్టం. అంతేకాదు నేను నా ప్లాన్స్ ప్రకారం ఆడతాను. ప్రతిసారీ సెంచరీలే చేయాల్సిన పని లేదు' అని అన్నాడు.

ఓపెనర్, 2, 3, 4, 5 స్థానాల్లో ఆడాను
'కఠిన సమయాల్లో 45, 50, 70 పరుగులు కూడా కొన్నిసార్లు జట్టుకు చాలా కీలకమవుతాయి. నేను అలాంటి ఇన్నింగ్స్ ఆడేందుకే చూస్తున్నా. వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయడమనేది మనసుకు సంబంధించింది. నేను ఓపెనర్, 2, 3, 4, 5 స్థానాల్లో ఆడాను. పరిస్థితిని నియంత్రించడమే కీలకం. కుల్దీప్, చాహల్ రోజురోజుకీ మెరుగవుతున్నారు. రెండు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన పాండే, జాదవ్‌ను తీసేయలేం. వారికి జట్టు మద్దతు ఉంది' అని రహానే చెప్పాడు.


Click it and Unblock the Notifications











