For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దురదృష్టం అనుకోను: రెండో వన్డేలో రనౌట్‌పై విజయ్ శంకర్

India vs Australia 2nd ODI : Vijay Shankar Not Looking At World Cup 2019 At This Point | Oneindia
Not thinking about World Cup: Vijay Shankar after helping India win 2nd ODI vs Australia

హైదరాబాద్: తాను వరల్డ్ కప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదని, జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానని టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తెలిపాడు. నాగ్‌పూర్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు విజయంలో విజయ్ శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్‌లోనూ విజయ్ శంకర్ మెరవడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీమిండియాకు ఇది 500వ విజయం. 1975లో వెంకట్రాఘవన్ సారథ్యంలోని టీమ్‌ఇండియా.. ఈస్ట్ ఆఫ్రికాపై తొలి విజయాన్ని నమోదు చేసింది.

నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియే కారణం

నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియే కారణం

అయితే, ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియేనని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచకప్‌ బెర్త్‌ గురించి ఆలోచించడం లేదని, కేవలం తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానని చెప్పాడు.

ప్రపంచకప్‌ సెలక్షన్‌ గురించి ఆలోచించడం లేదు

ప్రపంచకప్‌ సెలక్షన్‌ గురించి ఆలోచించడం లేదు

"నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.. ప్రపంచకప్‌ సెలక్షన్‌ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. నేను కేవలం జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే.. నిదాహస్‌ ట్రోఫీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది" అని అన్నాడు.

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసింది

"ఆ టోర్నీ తర్వాతే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసింది. అన్నివేళలో ప్రశాంతంగా ఉండాలనే తత్వం బోధపడింది. తాజా మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా బౌలింగ్‌ చేయాడనికి మానసికంగా సిద్ధమయ్యాను. 44 ఓవర్ల తర్వాత ఎప్పుడైనా బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అది చివరి ఓవరైనా చాలెంజ్‌కు సిద్ధంగా ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను" అని విజయ్ శంకర్ అన్నాడు.

ఆఖరి ఓవర్లో బుమ్రా మెళుకువలు

ఆఖరి ఓవర్లో బుమ్రా మెళుకువలు

"ఆఖరి ఓవర్లో బుమ్రా చెప్పిన మెళుకువలు ఎంతగానో కలిసొచ్చాయి. క్లబ్‌ క్రికెట్‌లో తప్పా నేనెప్పుడూ చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేయలేదు. చివరి ఓవర్లో రెండు వికెట్లు దక్కడంతో పొంగిపోలేదు. కేవలం ఆ మూమెంట్‌ను ఆస్వాదించాను అంతే. ఇక, రనౌట్‌ కావడం అనేది క్రికెట్‌లో సాధారణ విషయం. ఆ సమయంలో మళ్లీ క్రీజులోకి వేళ్లే అవకాశం లేదు. దీనిని నేను దురదృష్టం అనుకోను" అని అన్నాడు.

Story first published: Wednesday, March 6, 2019, 10:44 [IST]
Other articles published on Mar 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+