Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటికీ యువకుడే, గేల్ అనుభవం జట్టుకు కావాలి: కేఎల్ రాహుల్

IPL 2019 : We Have Learnt From Last Season's Mistakes, Says KL Rahul || Oneindia Telugu
Not thinking about 2019 ICC World Cup spot: KL Rahul

హైదరాబాద్: ప్రస్తుతం తన ధ్యాసంతా ఐపీఎల్‌పైనే ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. తాజాగా ఐఏఎన్ఎస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్ ఆరంభ మ్యాచ్‌ల్లో సరిగా ఆడలేదని తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

"ఒక ఆటగాడిగా ఐపీఎల్‌లో తమ ప్రాంఛైజీల తరుపున చక్కటి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్‌పైనే ఉంది. ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ రేసులో తప్పకుండా ఉంటా. వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తే.. ఐపీఎల్‌లో కూడా ఒత్తడిలో పడతాం" అని కేఎల్ రాహుల్ అన్నాడు.

రెండు మ్యాచుల్లో ఆడనంత మాత్రాన

"బయట ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలీదు. రెండు మ్యాచుల్లో ఆడనంత మాత్రాన నాపై విమర్శలు వస్తే పట్టించుకోను. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున మంచి ప్రదర్శన చేయాలి. ఒక్కమ్యాచ్‌లో రాణిస్తే తిరిగి ఫామ్‌లోకి వస్తాం. టీ20 క్రికెట్‌లో ఎక్కువ ఫన్ ఉంటుంది" అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఒకే షాట్‌ ఆడుతూ విఫలమౌతున్నాడని

ఈ మధ్య కాలంలో ఒకే షాట్‌ ఆడుతూ విఫలమౌతున్నాడని వస్తోన్న విమర్శలపై కూడా కేఎల్ రాహుల్ స్పందించాడు. "పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చెయ్యాలి. అలాంటి సమయాల్లో కొన్ని చెత్త షాట్లు ఆడాల్సి వస్తుంది. అవి వాటంతట అవే జరిగిపోతాయి. దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పుల నుంచే ఏదైనా నేర్చుకుంటాం" అని అన్నాడు.

వికెట్‌ కీపింగ్‌ గురించి

వికెట్‌ కీపింగ్‌ గురించి

ఇక, ఐపీఎల్‌లో వికెట్‌ కీపింగ్‌ గురించి అడిగిన ప్రశ్నకుగాను "క్రికెట్‌ అనేది జట్టుగా ఆడాల్సింది. బౌలర్‌గా అవకాశం రానప్పుడు వికెట్‌ కీపింగ్‌ చేయొచ్చు. గతేడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ తరఫున కూడా కీపింగ్‌ చేశాను. టీ20ల్లో కీపింగ్‌ చెయ్యడం నాకెంతో ఇష్టం" అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

క్రిస్‌గేల్‌ గురించి

క్రిస్‌గేల్‌ గురించి

పంజాబ్ జట్టు విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌ గురించి "ఐపీఎల్‌లో గేల్ విధ్వంసక బ్యాట్స్‌మన్. గేల్‌ తన జట్టుకి పరుగుల వరదే కాదు ఇంకా చాలా చేస్తాడు. టీ20 క్రికెట్‌లో వినోదాన్ని నింపుతాడు. డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తాడు. గేల్ అసలు నలభై ఏళ్ల వ్యక్తిలా కనిపించడు" అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

గేల్ ఇంకా యువకుడినే అనుకుంటాడు

"గేల్ వయసు ప్రస్తుతం 39 ఏళ్ల 192 రోజులు. టోర్నమెంట్‌లో ఎక్కువ వయసు కలిగిన ఆటగాళ్లలో ఒకడు. అయినప్పటికీ తాను ఇంకా యువ ఆటగాడినే అనుకుంటాడు. ఆటను ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ తన బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకుంటాడు. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి జట్టులో ఉండటం ఎంతో అవసరం" అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.

Story first published: Tuesday, April 2, 2019, 14:39 [IST]
Other articles published on Apr 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+