
ధోనిని టీ20 జట్టు నుంచి తప్పించడంపై
"ధోనీ ఆరు టీ20ల్లో ఆడడం లేదు. మేం సమర్థుడైన రెండో వికెట్‌కీపర్ కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకానీ అతడికి ద్వారాలు మూసుకుపోలేదు" అని స్పష్టం చేశారు. ధోనికి టీ20ల నుంచి విశ్రాంతినివ్వడంపై తాజాగా గంగూలీ మాట్లాడుతూ "ధోనిని టీ20 జట్టు నుంచి తప్పించడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు" అని అన్నాడు.

చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాట్‌తో రాణించడం లేదు
"ఎందుకంటే గత కొంతకాలంగా అతను చెప్పుకోదగ్గ స్థాయిలో బ్యాట్‌తో రాణించడం లేదు. 2020లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ అతను ఆడటం అనుమానమే. అందుకే, ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. టీమిండియా ఇప్పటివరకు 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 93 మ్యాచ్‌ల్లో ధోని ఉన్నాడు.

127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేసిన ధోని
అతడు 127 స్ట్రైక్‌రేట్‌తో 1487 పరుగులు చేశాడు. అలాంటిది... తాజాగా రెండు టీ20 సిరీస్‌ల నుంచి ధోనీని తప్పించడంతో.. ఇక వచ్చే ఏడాది జనవరి 12 వరకూ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం అతనికి లేకపోయింది. విండిస్‌తో నవంబరు 4 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

జనవరి 12 నుంచి జరిగే వన్డేల్లో మైదానంలోకి
దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జనవరి 12 నుంచి జరిగే వన్డేల్లో మాత్రమే ధోని మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. అప్పటి నుంచి కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతోన్న సంగతి తెలిసిందే. మరోవైపు విండిస్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.


Click it and Unblock the Notifications
