భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైనవాడు: పాక్ క్రికెటర్

ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2019 సెమీ ఫైనల్స్ నుండి టీమిండియా నిష్క్రమించిన తరువాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి చాలా వార్తలు హల్చల్ చేశాయి. కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తం అయింది. విండీస్ పర్యటన నేపథ్యంలో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలని సెలెక్టర్లపై ఒత్తిడి వచ్చింది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

గావస్కర్ అసంతృప్తి:
భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడు. ప్రపంచకప్ ప్రదర్శనపై ఒక్క సమీక్షా సమావేశం లేకుండానే విరాట్ కోహ్లీని తిరిగి కెప్టెన్‌గా కొనసాగించడమేంటని బాహాటంగానే ప్రశ్నించాడు. అయితే పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే సరైనవాడని పేర్కొన్నాడు.

కెప్టెన్సీలో మార్పు అవసరం లేదు:
షోయబ్ అక్తర్ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో అభిమానుల కోసం ఒక సెషన్ ఏర్పాటు చేసాడు. అక్తర్ అభిమానులలో ఒకరు 'భవిష్యత్తులో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతాడా?' అని ప్రశ్నించాడు. దీనికి అక్తర్ ఏమాత్రం ఆలోచించకుండా.. 'భారత కెప్టెన్సీలో మార్పు అవసరం లేదు' అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా కోహ్లినే సరైన వాడని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిప్రాయపడ్డాడు.

విభేదాలు పూర్తిగా నిరాధారం:
ప్రపంచకప్ ఓటమితో కోహ్లీ, రోహిత్‌ల మధ్య విబేధాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. తన కెప్టెన్సీ కాపాడుకోవడానికే కోహ్లీ వెస్టిండీస్ పర్యటకు విశ్రాంతి తీసుకోలేదని కూడా పుకార్లు వచ్చాయి.అయితే ఇవన్నీ వట్టి పుకార్లే అని సోమవారం కోహ్లీ వెల్లడించాడు. 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాలు పూర్తిగా నిరాధారం. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగుతున్నారు. బయట ఉన్నవాళ్లు లేని వార్తలు పుట్టిస్తుంటే అసహ్యమేస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంత మంచి వాతావరణం ఉందో ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే.. జట్టు అంత మంచి ప్రదర్శనలు చేసేది కాదు' అని కోహ్లీ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications