For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కెరీర్‌లో ఆ రెండే చింతించాల్సిన సందర్భాలు: సచిన్

Not Playing with Gavaskar & Viv Richards are two biggest regrets of Sachin Tendulkar

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా రెండు నెలలకు పైగా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరు ఇంట్లో తాము చేసే పనులను అభిమానులతో పంచుకుంటుంటే.. మరికొందరు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో చింతించాల్సిన ఓ రెండు సందర్భాలు ఉన్నాయని తెలిపాడు.

గవాస్కర్‌తో ఆడలేకపోయా

గవాస్కర్‌తో ఆడలేకపోయా

క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఓ మహోన్నత శిఖరం. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌తో కలసి ఆడలేకపోవడం చింతించాల్సిన సందర్భం అని అన్నాడు. 'సునీల్ గవాస్కర్‌ నా బ్యాటింగ్‌ హీరో. నేను అరంగేట్రం చేసే ఒకటి రెండేళ్ల ముందే గవాస్కర్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతనితో కలిసి ఆడలేకపోవడం నిరాశే. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయా' అని సచిన్‌ తెలిపాడు.

వివ్‌తో అవకాశం రాలేదు

వివ్‌తో అవకాశం రాలేదు

విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ ఉన్నజట్టు‌తో తలపడలేకపోవడం తన కెరీర్‌లో చింతించాల్సిన రెండో సందర్భం అని లిటిల్ మాస్టర్‌ పేర్కొన్నాడు. 'కౌంటీల్లో వివ్‌తో ఆడే అదృష్టం దక్కింది. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో రిచర్డ్స్‌కు వ్యతిరేకంగా ఆడే చాన్స్‌ రాలేదు' అని సచిన్ చెప్పాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. టెండూల్కర్‌ టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తూనే.. దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను అందుకున్నాడు.

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

క్రికెట్‌కే వన్నె తెచ్చిన సచిన్

24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ క్రికెట్‌కే వన్నె తెచ్చాడు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికై తన బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే, తనే ఓ చరిత్రగా మిగిలిపోయాడు. యావత్‌ క్రీడాభిమానులంతా సచిన్‌ను దేవుడిగా చూస్తారు. 16 ఏళ్లకే భారత జట్టుకు ఎంపికైన సచిన్.. పాకిస్థాన్‌ మీద అరంగేట్రం చేశాడు. తన పరుగుల వేటతో ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ డాన్‌బ్రాడ్‌మన్‌తో అభిమానులు తనని పోల్చుకునేలా ఎదిగాడు.

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు.

2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Thursday, May 21, 2020, 14:16 [IST]
Other articles published on May 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+