కార్గిల్ సమయంలోనే గెలిచాం... పోరాడకుండా లొంగిపోతారా?: భారత్-పాక్ మ్యాచ్‌పై థరూర్


హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, భారత్-పాక్ మ్యాచ్‌పై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అజహరుద్దీన్, హర్భజన్ సింగ్ లాంటి క్రికెటర్లు అంటుంటే... పాక్‌తో మ్యాచ్ ఆడకపోతే భారత్‌కే నష్టమని మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, చేతన్ చౌహన్‌లాంటి వాళ్లు వెల్లడించారు.
భారత్-పాక్ మ్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు
దీంతో భారత్-పాక్ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్లలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడాలని అన్నాడు. మ్యాచ్ ఆడకపోవడం వల్ల రెండు పాయింట్లు కోల్పోవడమే కాదు.. ఇది లొంగిపోవడం కంటే దారుణమని, పోరాడకుండానే ఓటమి అంగీకరించినట్లు అవుతుందని శశిథరూర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
1999లో కార్గిల్ యుద్ధ సమయంలో
1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడి గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా శశిథరూర్ గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన వేరే చర్యల స్థానంలో క్రికెట్‌ను బలి చేయకూడదని శశిథరూర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జూన్ 16న భారత్-పాక్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాపోర్డ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలి
మరోవైపు వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ శశాంక్ మనోహార్‌ను సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ డ్రాప్ట్ నోట్‌ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్‌ను వరల్డ్‌కప్ నుంచి నిషేధించపోతే వరల్డ్‌కప్ నుంచి తామే తప్పుకుంటామని ఆ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడకపోతే ఎదురయ్యే సమస్యలపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ లీగల్ కన్సల్టెంట్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

పాక్‌ను తప్పించడం సాథ్యం కాదన్న గవాస్కర్
సీఓఏ వినోద్ రాయ్ అనుమతితోనే బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ డ్రాప్ట్ నోట్‌ని తయారు చేశారు. కాగా, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ నుంచి పాక్‌ను తప్పించడం సాథ్యం కాదని గవాస్కర్ తేల్చి చెప్పాడు. గవాస్కర్ మాట్లాడుతూ "వరల్డ్ కప్ నుంచి పాక్‌ను తప్పించాలని బీసీసీఐ ప్రయత్నించవచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలు కూడా అంగీకరించాలి. ఇది మీ రెండు దేశాల వ్యవహారం. ఇందులోకి మమ్మల్ని లాగొద్దు అని వాళ్లు అంటే పాకిస్థాన్‌ను తప్పించడం సాధ్యం కాదు. ఐక్య రాజ్య సమితిలోనే ఈ అంశం తేల్చుకోవాలి. అదే సరైన వేదిక" అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications