Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రాహుల్‌ను పక్కన పెట్టడం అతనికీ మంచిదే.. ఎందుకంటే?

Not playing KL Rahul will do good to him know why

టీమిండియా టెస్టు టీంలో ప్రస్తుతం ఫామ్‌లో లేని బ్యాటర్ కేఎల్ రాహుల్. అతను ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నాడు. అయినా సరే రాహుల్ మంచి సత్తా ఉన్న ఆటగాడని, అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తామని టీం మేనేజ్‌మెంట్ తేల్చిచెప్పింది. కానీ విమర్శకులు, ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయంపై సంతోషంగా లేరు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో రాహుల్‌ను పక్కన పెట్టాలని అంటున్నారు. దీనికి ప్రధానంగా వాళ్లు చెప్తున్న కారణాలు ఏంటంటే..

చెత్త ఫామ్‌..

చెత్త ఫామ్‌..

రాహుల్ తన కెరీర్‌లో ఇప్పుడు ఉన్నంత చెత్త ఫామ్‌లో ఎప్పుడూ లేడు. టెస్టు క్రికెట్‌లో సుమారు ఏడాది కాలంగా ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడీ కర్ణాటక బ్యాటర్. ఇప్పుడు ఆస్ట్రేలియా మీదనే కాదు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీసులో కూడా రాహుల్ రాణించలేదు. ఇక ఆసీస్‌పై అతను బ్యాటింగ్ చేసిన మూడు ఇన్నింగ్సుల్లో అత్యంత చెత్తగా ఆడాడు. అసలు 2018 నుంచి రాహుల్ గణాంకాలు చూసుకున్నా కూడా.. మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అతని టెస్టు యావరేజ్ కూడా 25.82గా ఉంది. ఇంత దారుణమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడికి ఇంకెన్ని ఛాన్సులు ఇస్తారనేది విమర్శకుల సూటి ప్రశ్న.

అసలు సమస్య అదే..

అసలు సమస్య అదే..

రాహుల్ ఆటతీరు చూసిన చాలా మంది అతని టెక్నిక్‌లో లోపం లేదని, సమస్య అంతా అతని ఆలోచనా ధోరణితోనే అని చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌కు బ్రేక్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదంటే దేశవాళీలు లేదంటే కౌంటీ క్రికెట్ వంటి అంత ఒత్తిడి లేని మ్యాచులు ఆడితే రాహుల్ మళ్లీ ఫామ్ అందుకుంటాడని వాదిస్తున్నారు. ఛటేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లు కూడా ఇలాగే కౌంటీలు ఆడి తిరిగి ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే. రాహుల్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్న వెంకటేష్ ప్రసాద్ కూడా ఇదే విషయం చెప్పాడు. అవసరమైతే ఐపీఎల్ వదిలేసి అయినా కౌంటీలు ఆడాలని సలహా ఇచ్చాడు.

ఛాన్స్ కోసం గిల్ వెయిటింగ్..

ఛాన్స్ కోసం గిల్ వెయిటింగ్..

ఒక పక్క రాహుల్ చెత్త ఫామ్ కొనసాగుతుంటే.. మరో పక్క శుభ్‌మన్ గిల్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. తన కెరీర్ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌కు టెస్టుల్లో అవకాశం ఇవ్వకపోవడం చాలా విమర్శలకు దారితీస్తోంది. గతేడాది చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీసులో తన తొలి టెస్టు శతకం సాధించిన గిల్.. అదే జోరు ఆస్ట్రేలియా మీద కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు. కానీ ఆ అవకాశం మాత్రం అతనికి దక్కడం లేదు. ఈ ఛాన్స్ ఇవ్వాలని చాాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి చివరి రెండు టెస్టుల్లో టీం మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Monday, February 20, 2023, 18:03 [IST]
Other articles published on Feb 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+