న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడకుండా ఉండటం పరిష్కారం కాదు: ఆటగాళ్ల పనిభారంపై గంగూలీ

Not Playing is Not the Solution: Ganguly on Workload Management

హైదరాబాద్: వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆటగాళ్లపై పనిభారం పెరుగుతుందని.. అసలు ఆటే ఆడకుండా ఉండడం సరైన నిర్ణయం కాదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ... దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని గంగూలీ ఈ సందర్భంగా సూచించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌ కోసం సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటగాళ్ల పనిభారంపై గంగూలీ మాట్లాడాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆటగాళ్లు అలసటతో ఆందోళన

ఆటగాళ్లు అలసటతో ఆందోళన

"రాబోయే రోజుల్లో చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఎంత మంది క్రికెటర్లు 15, 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు? ఆటగాళ్లు అలసటతో ఆందోళన చెందుతున్నారని నేను అనుకోవడం లేదు. తాజాగా ఉండటానికి అవసరమైన మార్గాన్ని కనుక్కోండి. మ్యాచ్‌లను వదిలేయడం సమస్యకు పరిష్కారం కాదు" అని అన్నాడు.

క్రికెట్ కెరీర్ చాలా చిన్నది

క్రికెట్ కెరీర్ చాలా చిన్నది

"ఎందుకంటే క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. అంతర్జాతీయ స్థాయి, ఐపీఎల్‌లో మళ్లీ మళ్లీ అవకాశాలు రావు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నించాలి" అని గంగూలీ చెప్పాడు. మరోవైపు తమ పేసర్ బుమ్రా.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమమని ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే సూచించాడు.

శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలి

శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలి

అయితే, ఆటగాళ్లు ఎవరికి వారు తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్‌లు ఆడాలని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. "గత నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇటీవల విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడాం. అయితే, ఐపీఎల్‌లో ఎలా వ్యవహరించాలన్నది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. ఆటగాళ్లు తమ శరీరం ఏం చెబుతోందో వినాలి" అని రోహిత్ అన్నాడు.

పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తాం

పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తాం

"వరల్డ్‌కప్ చాలా ముఖ్యమైన టోర్నీనే. కానీ ఐపీఎల్‌ కూడా పెద్దదే. దానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అన్నీ చూసుకుని పని భారాన్ని అంచనా వేసి ఎన్ని మ్యాచ్‌లు ఆడాలన్నది నిర్ణయం తీసుకోవాలి" అని రోహిత్‌ చెప్పాడు. భారత పేసర్ల ఫిట్‌నెస్‌పై ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్‌లో పర్యవేక్షిస్తామన్నారు.

Story first published: Wednesday, March 20, 2019, 10:02 [IST]
Other articles published on Mar 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X