
ఇలా ప్రాక్టీస్ చేస్తారా?
ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సరిగా సన్నద్ధం కాలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా మండిపడ్డాడు. కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకపోతే ఇక అసలు మ్యాచుల్లో ఇలాగే ఉంటుందని ఎగతాళి చేశాడు. మరికొందరేమో బిగ్ బాష్ లీగ్‌లో ఆడటం వల్ల కూడా ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం పడిందని కూడా కొందరు అన్నారు. అయితే అలాంటిదేం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా హై-పెర్ఫామెన్స్ మేనేజర్ బెన్ ఆలివర్ స్పష్టం చేశాడు. భారత్‌తో సిరీస్ ముందు ఆసీస్ జట్టు సన్నాహకాలు బాగానే జరిగాయని, ఆటగాళ్లు కూడా వీటిపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పాడు.

భారత్‌పై నమ్మకం లేకనే..
భారత్‌తో టెస్టులకు ముందు ప్రాక్టీస్ మ్యాచులు ఆడకుండా.. ప్రత్యేకంగా స్పిన్ ట్రాక్‌లపై బ్యాటింగ్ చేయడానికి ఆసీస్ బ్యాటర్లు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. దీనికోసం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా స్పిన్ పిచ్ తయారు చేశారు. ఆ తర్వాత బెంగళూరులో కూడా నాలుగు రోజుల పాటు స్పిన్ స్పిచ్‌పై ప్రాక్టీస్ చేశారు. కానీ భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు మాత్రం ఆసీస్ నిరాకరించింది. గతంలో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పచ్చని పిచ్ తయారు చేశారని, కానీ అసలు మ్యాచ్‌లో స్పిన్ పిచ్‌పై ఆడలేకపోయామని చెప్పారు. ఇలాంటివి మళ్లీ జరగకూడదనే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదని తేల్చేశారు.

కొన్నిసార్లు అక్కర్లేదు..
ఈ సన్నాహకాలు సరిపోలేదని వస్తున్న విమర్వలపై ఆలివర్ స్పందించాడు. 'అలాంటిదేం లేదు. ఒక సిరీస్ కోసం రెడీ అయ్యేటప్పుడు రకరకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం. ఇప్పుడు కూడా అదే చేశాం. ఆటగాళ్లు, స్టాఫ్, సెలెక్టర్లు అందరూ ఆలోచించే ఈ ప్రాక్టీస్ ప్లాన్ వేశారు' అని ఆలివర్ చెప్పాడు. కొన్ని పరిస్థితుల్లో ప్రాక్టీస్ మ్యాచులు అక్కర్లేదని, కొన్ని చోట్ల అవసరమని అన్నాడు. 'ఆస్ట్రేలియా బృందం ఈ సిరీస్ కోసం చేసిన ప్రాక్టీస్ అందరికీ సంతృప్తిని ఇచ్చింది. అలాగే బిగ్ బాష్ లీగ్‌లో ఆడిన వాళ్లందరూ ఆస్ట్రేలియా క్రికెట్‌పై పాజిటివ్ ప్రభావమే చూపించారు' అని తేల్చిచెప్పాడు.


Click it and Unblock the Notifications
