For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : రెండో వన్డేలో ఈ స్టార్ ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్..!

Not only Rohit these players failed miserably ODI

ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు అత్యంత ఘోరంగా ఓడింది. ఇప్పటి వరకు టీమిండియా ఇంత పెద్ద ఓటమిని ఎప్పుడూ మూట గట్టుకోలేదు. కానీ విశాఖ వన్డేలో ఏకంగా మరో 234 బంతులు మిగిలి ఉండగానే ఓడిపోయింది. ఆసీస్ బ్యాటింగ్ చూస్తే పిచ్‌ నుంచి బ్యాటర్లకు ఎంత సహకారం అందుతుందో తెలిసిపోయింది. కానీ భారత బ్యాటర్లు మాత్రం ఘోరంగా ఫెయిలయ్యారు. దీనివల్లనే ఓడిపోయామని కెప్టెన్ రోహిత్ కూడా చెప్పాడు. మరి రెండో వన్డేలో అట్టర్ ఫ్లాప్ అయిన భారత బ్యాటర్లు ఎవరో ఒకసారి చూస్తే..

శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్

టీమిండియాలో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్.. రెండో వన్డేలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆసీస్ వద్ద ఉన్న క్వాలిటీ పేస్‌ను ఎదుర్కోవడంలో ఫెయిలయ్యాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా స్టార్క్ వేసిన బంతిని లూజ్ షాట్ ఆడి, పాయింట్‌లో ఉన్న లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి వన్డేలో కూడా అతను సేమ్ టూ సేమ్ ఇదే పద్ధతిలో అవుటైన సంగతి తెలిసిందే. ఇక విశాఖ వన్డేలో అయితే కనీసం ఖాతా కూడా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా క్వాలిటీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం శ్రీలంకపై పరుగులు చేసినంత ఈజీ కాదని విమర్శిస్తున్నారు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

బామ్మర్ది పెళ్లికి వెళ్లి తొలి వన్డే మిస్ అయిన రోహిత్ శర్మ.. విశాఖ వన్డేలో జట్టుతో కలిశాడు. ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి అతను ఓపెనర్‌గా వచ్చాడు. కానీ అతనిపై ఉన్న అంచనాలను మాత్రం ఏమాత్రం అందుకోలేకపోయాడు. గిల్ అవుటైన తర్వాత కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన అతను.. అనవసర షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఎడం చేతి వాటం స్వింగ్ బౌలర్లను ఎదుర్కోవడానికి రోహిత్ ఇబ్బంది పడటం ఇదేం కొత్త కాదు. ఈ క్రమంలోనే స్టార్క్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో ఉన్న స్మిత్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇలా రోహిత్ కూడా అవుటవడంతో భారత బ్యాటింగ్ లైనప్‌ తీవ్రమైన ఒత్తిడిలో పడి కుప్పకూలింది.

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా

తొలి వన్డేలో కూడా ఓ మోస్తరు ఆటతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. రెండో వన్డేలో దారుణంగా ఫెయిలయ్యాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాల్సింది పోయి చెత్త షాట్ ఆడాడు. ఆబాట్ వేసిన బంతి దూరంగా వెళ్తుంటే అనవసరంగా బ్యాటును ముందుకు జరిపాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని స్మిత్ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. షాట్ ఆడాలని లేకపోతే అసలు బ్యాటుతో బంతిని కదిలించడం దేనికని పాండ్యాను తిట్టిపోశారు. ఆ తర్వాత బౌలింగ్‌లో కూడా పాండ్యా ఏం సాధించలేదు. అతను వేసిన ఏకైక ఓవర్లో మిచెల్ మార్ష్ మూడు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఆ తర్వాత అతనికి రోహిత్ బంతిని ఇవ్వలేదు.

 సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

తొలి వన్డేలో తను ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరిన సూర్యకుమార్ యాదవ్‌కు.. రెండో వన్డేలో మంచి అవకాశం దక్కింది. వేగంగా రెండు వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన అతను.. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పే ఛాన్స్ దొరికింది. కానీ దాన్ని సూర్య ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. స్టార్క్ వేసిన ఇన్‌స్వింగర్‌కు బోల్తా కొట్టాడు. మరోసారి ఎల్బీడబ్ల్యూగా తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ఇది చూసిన నిపుణులు కూడా అసలు క్రీజులో సూర్య నిలబడే స్టాన్స్ కూడా సరిగా లేదని విమర్శిస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ లేని లోటును పూడ్చేందుకు వచ్చిన సూర్య.. తనే జట్టుకు పెద్ద భారంగా మారాడని ఫ్యాన్స్ కూడా తిట్టిపోస్తున్నారు. మరి మూడో వన్డేలో అతనికే ఛాన్స్ ఇస్తారా? ఇస్తే సూర్య రాణిస్తాడా? లేక మళ్లీ ఇలాగే ఫెయిలవుతాడా తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.

Story first published: Monday, March 20, 2023, 10:48 [IST]
Other articles published on Mar 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+