మాంఛెస్టర్: క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ చిరపరిచితమైన పేరు డీకే. ఈ పేరుతో భారత జట్టులో ఉన్న ఏకైక ఆటగాడెవరని ప్రశ్నిస్తే..సమాధానం కోసం ఎవరూ పెద్దగా తడుముకోరు. దినేష్ కార్తీక్ అని ఇట్టే బదులిచ్చేయగలరు. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా గల అన్ని క్రికెట్ జట్లలో డీకే అనే పేరుతో మరో క్రికెటర్ ఇన్నాళ్లూ కనిపించలేదు. దీనికి భిన్నంగా మరో ఆటగాడు తెరపై ప్రత్యక్షం అయ్యాడు.
అతనే దౌలర్ జడ్రన్. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. ప్రపంచకప్‌లో భాగంగా మాంఛెస్టర్‌లో ఇంగ్లండ్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో తొలి వికెట్ తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జేమ్స్ విన్సీ వికెట్ పడగొట్టాడు. అతని జెర్సీ వెనుక కూడా డీకే అనే అక్షరాలు వీక్షకులను ఆకర్షించాయి.ఈ ఆఫ్ఘనిస్తాన్ డీకే.. కుడిచేతి వాటం బౌలర్. బ్యాటింగ్ కూడా చేయగల సత్తా ఉంది.
పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ అర్థర్ ఉద్యోగం ఊడినట్టేనా
ఆఫ్ఘన్ జాతీయ జట్టుతో పాటు బంద్ ఇ-అమీర్ రీజియన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2011లో తొలిసారిగా కెనడాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటిదాకా 79 వన్డేలు, 33 టీ20లను ఆడాడు. 79 వన్డేల్లో 53 ఇన్నింగ్‌లను ఆడి 512 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యథిక స్కోరు 47. 33 టీ20ల్లో 16 ఇన్నింగ్‌లను ఆడాడు. వన్డేల్లో 22 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. అదే అతని బెస్ట్.