లంక సిరిస్‌కు ధోనిని తప్పించండి: చోప్రా సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీ20ల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు సూచించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ధోని నెమ్మదిగా ఆడుతున్నాడని.. వెంటనే తప్పుకోని యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలోకి మరో క్రికెటర్ చేరాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనను దృష్టిలో ఉంచుకోని శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ధోని స్ధానంలో మరొకరిని జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలక్టర్లకు సూచించాడు. ఓ స్టోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసింది
'ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక భారత్‌లో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 20న తొలి టీ20 జరగనుంది' అని చోప్రా అన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న కోహ్లీసేన
'అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఇదే మనకు మంచి అవకాశం. వన్డేల్లో నంబర్ వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు సవాల్‌తో కూడుకున్నది. దక్షిణాఫ్రికా జట్టుతో మనం టీ20 సిరీస్ కూడా ఆడబోతున్నాం. ఈ ఏడాది శ్రీలంక గడ్డపై ఆ జట్టును క్లీన్ స్వీప్ చేశాం' అని చోప్రా తెలిపాడు.

మనం కొన్ని ప్రయోగాలు చేయాలి
'శ్రీలంతో పోలిస్తే భారత జట్టు మెరుగైన స్థితిలో ఉంది. కాబట్టి.. శ్రీలంకతో జరిగే సిరిస్‌లో మనం కొన్ని ప్రయోగాలు చేయాలి. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ధోని స్థానంలో మరో యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలి' అని ఆకాశ్ చోప్రా అన్నారు.

ధోనికి మద్దతుగా నిలిచిన గవాస్కర్, సెహ్వాగ్, కోహ్లీ
ఇదిలా ఉంటే ఈ విషయంలో సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, కెప్టెన్ కోహ్లీలు ధోనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీమిండిమాతో మూడు వన్డేలు, మూడు టీ20, మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు బుధవారం భారత్‌కు చేరింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్ 16న కొల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications