హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు మిస్టర్ కూల్‌గా పిలుచుకుంటారు. ఒత్తిడి సమయాల్లో మ్యాచ్‌లను కూల్‌గా ఫినిష్ చేసే క్రమంలో ధోనికి భారత్ క్రికెట్ అభిమానులు మిస్టర్ కూల్ అనే ట్యాగ్‌ని జత చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ , స్కోరు కార్డు
మైదానంలో టీమిండియా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ధోని ఎల్లప్పుడూ కూల్ గానే కనిపిస్తుండటాన్ని మనం చాలా సార్లు చూశాం. ఒత్తిడిని జయించడం అనేది ధోనిని చూసి నేర్చుకోవాలని ఇప్పటికీ పలువురు మాజీలు చెబుతుండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ప్రపంచ క్రికెట్‌లో ధోని మిస్టర్ కూల్ కాదని అంటున్నాడు న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్. అంతేకాదు అసలు ధోని కెప్టెన్ కూల్ కాదని కూడా తేల్చి చెప్పాడు. ఇందుకు తగిన వ్యక్తి మరొకరు ఉన్నారంటూ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరును సూచించాడు.
'నా ప్రకారం చూస్తే ధోని కామెస్ట్ క్రికెటర్ కాదు. కేన్ విలియమ్సనే అందుకు అన్ని విధాలా అర్హడు. మైదానంలో తన పనిని చాలా కూల్‌గా ముగించడంలో విలియమ్సన్ సిద్ధహస్తుడు. నా వరకూ అయితే ప్రపంచ క్రికెట్‌లో మిస్టర్ కూల్ ఎవరైనా ఉన్నారంటే అది విలియమ్సన్ ఒక్కడే' అని బౌల్ట్ పేర్కొన్నాడు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తన రెండో మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.