For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిద్ర లేని రాత్రులేం గడపలేదు, కొత్త బాధ్యతను నెరవేరుస్తా

Not looking at IPL as platform for India comeback: Ashwin

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడేళ్ల క్రితం వైదొలగిన రైనా మాదిరిగానే ఏడాది నుంచి రవిచంద్రన్ అశ్విన్ సైతం భారత పరిమిత ఓవర్ల క్రికెట్‌ పునరాగమనం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. కేవలం టెస్టు ఫార్మాట్‌కే పరిమితమైన ఈ సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కోల్పోవడం జీవితంలో భాగంగానే పేర్కొన్నాడు. అందుకోసం నిద్రలేని రాత్రులు ఏమీ గడపలేదన్నాడు. తాను ఖచ్చితంగా మళ్లీ భారత అంతర్జాతీయ జట్టుకు ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన అశ్విన్‌ మాట్లాడుతూ.. పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటుగా తాను భారత పరిమిత ఓవర్ల జట్టులోకి పునరాగమనం చేయడం అనేది కచ్చితంగా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, దీనికోసం ఐపీఎల్‌ను ప్లాట్‌ఫామ్‌‌గా చూడటం లేదన్నాడు.

'టీమిండియాలో రీ ఎంట్రీ కోసం ఐపీఎల్‌ను ప్రామాణికంగా చూడటం లేదు. ప్రతీ ఏడాది ఐపీఎల్‌ ఆడుతున్నట్లే ఈ ఏడాది కూడా ఆడుతున్నా. అదే మైండ్‌ సెట్‌తో పోరుకు సిద్దమవుతున్నా. అయితే ఈ సీజన్‌లో నాపై అతి పెద్ద బాధ్యత పడింది. కెప్టెన్‌గా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించడం నా ముందున్న సవాల్‌. దానిపైనే దృష్టి పెట్టా. అంతేకానీ ఐపీఎల్‌ను టీమిండియా జట్టులోకి పునరాగమనం కోసం మాత్రం చూడటం లేదు. జాతీయ జట్టులో నా రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే నమ్మకం ఉంది' అని అశ్విన్‌ తెలిపాడు.

కాగా, మున్ముందు మొదలుకాబోతున్న ఐపీఎల్ సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా సీనియర్లు ప్లేయర్లు హ్యాండిల్ చేయనున్నాడు. జట్టులో భాగమైన యువరాజ్ సింగ్, ఫించ్, డేవిడ్ మిల్లర్, క్రిస్ గేల్ ఈ సీజన్‌కు పంజాబ్ జట్టులో హైలెట్‌గా నిలవనున్నారు. అతనికి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్లు ఆడిన అనుభవం ఉంది. జట్టు గురించి మాట్లాడుతూ వాళ్లతో సమన్వయం చేసుకోవడానికి ఇబ్బందేమీ లేదన్నాడు.
రవి చంద్రన్ అశ్విన్ కెరీర్‌లో 111వన్డేలు, 57టెస్టులు, 46టీ 20లు ఆడాడు. అతను ఐపీఎల్‌లో 2009 నుంచి 2015 వరకు ఏడు సీజన్లలో ఆడాడు.

Story first published: Tuesday, February 27, 2018, 17:32 [IST]
Other articles published on Feb 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+