న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ, బీసీసీఐ.. ఫిట్‌నెస్‌ కావాలంటే ఈ మాంసం తినిపించండి'

Kohli..'Don't Eat Grilled, Eat Kadaknath Chicken' | Oneindia Telugu
Not Grilled, Eat Kadaknath Chicken: A Special Request To Virat Kohli From Krishi Vigyan Kendra

ఝూబువా: అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తోన్న దేశంగా భారత్ ఎదిగే దశలో ఉంది. ఈ క్రమంలోనే యోయో వంటి ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి అవి పాసైతేనే విదేశాలకు, స్వదేశంలో మ్యాచ్‌లను క్రికెటర్లతో ఆడిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ ఫిట్‌నెస్ మాస్టర్‌గా మారిపోయిన కోహ్లీని అనుసరిస్తున్న వారెందరో. ఈ విషయంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత జట్టు సభ్యుల మెరుగైన డైట్‌ కోసం మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలోని కృషి విజ్ఞాన కేంద్రం కొన్ని సూచనలు చేసింది.

ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటున్నారట

ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటున్నారట

ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ప్రొటీన్ల కోసం తమ ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారట. అయితే వాటి కంటే మధ్యప్రదేశ్‌లో స్థానికంగా లభిస్తోన్న కఢక్‌నాథ్ చికెన్‌ వల్ల ఎక్కువ ఉపయోగాలుంటాయని పేర్కొంది. ఆ వివరాలన్నీ ప్రస్తావిస్తూ.. విరాట్ కోహ్లీతో పాటుగా బీసీసీఐకు కలిపి ఓ లేఖ రాసింది.

ప్రొటీన్‌తో పాటు ఐరన్‌ పుష్కలంగా

‘విరాట్, జట్టులోని సహచరులు తమ తీసుకునే ఆహారంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటారని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే దానిలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. దాన్ని డైట్‌లో తీసుకోవడం కంటే తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ ఉన్న కఢక్‌నాథ్ చికెన్‌ను వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయని తెలిపింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ మీట్ నివేదిక ప్రకారం దానిలో ప్రొటీన్లు, ఐరన్‌ పుష్కలంగా ఉన్నాయి' అని వివరించింది.

 ఫిట్‌నెస్ కోసం నాన్‌వెజ్ వదిలేసిన కోహ్లీ

ఫిట్‌నెస్ కోసం నాన్‌వెజ్ వదిలేసిన కోహ్లీ

క్రికెటర్లలో ఫిటెనెస్‌ గురించి చెప్పేటప్పుడు ముందుగా ప్రస్తావించేవారిలో కోహ్లీ పేరు కూడా ఉంటుంది. అయితే గతంలో వెల్లడైన కథనాల ప్రకారం.. విరాట్ మెరుగైన ఫిట్‌నెస్‌, ఆరోగ్యం కోసం వెజిటేరియన్ డైట్‌కి మారిపోయినట్లు సమాచారం. దానికోసం అతడికి ఎంతో ఇష్టమైన బటర్‌ చికెన్‌ను కూడా వదిలేసినట్లు ఓ సమావేశంలో తెలిపాడు.

 అక్కడ ఫుట్ ఫామస్

అక్కడ ఫుట్ ఫామస్

ఈ కడక్‌‌నాథ్‌ చికెన్‌కు మధ్యప్రదేశ్‌లోని జబువా, ధార్‌ జిల్లాలు బాగా ప్రసిద్ధి. అయితే ఆ కోడి మాంసం నలుపు రంగులో ఉంటుంది. అధిక సంఖ్యలో ప్రొటీన్లు, కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఈ చికెన్‌కు స్థానికంగానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ.

Story first published: Thursday, January 3, 2019, 15:31 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X