ఓపెనర్‌గా సన్నీకి ఏ మాత్రం తీసిపోడు, నా తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అతడే: గంగూలీ

హైదరాబాద్: తన తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. భారతదేశపు ఉత్తమ కెప్టెన్లలో ఒకడిగా పరిగణించబడే గంగూలీ అతని కాలంలో భారతదేశపు గొప్ప క్రికెటర్లు సౌరవ్ గంగూలీ... సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్‌తో ఆడారు.
అంతేకాదు టీమిండియాకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను ఏర్పాటు చేశాడు. అయితే, తన తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ మాత్రం సెహ్వాగేనని దాదా స్పష్టం చేశాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ మా కాలంలో అతిపెద్ద మ్యాచ్ విజేత" అని అన్నాడు.

సెహ్వాగ్‌పై నమ్మకం ఉంది
"నాకు అతడిపై సొంత నమ్మకం ఉంది. అతడిని ఓపెనర్‌గా బరిలోకి దిగమని చెప్పాను. తమ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి అలవాటు పడకుండా, జట్టు కోసం అన్ని స్థానాల్లో బరిలోకి దిగడానికి సన్నద్ధంగా ఉండాలని అన్నాను" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

వన్డేల్లో 4 లేదా 5 స్థానాల్లో
"వన్డేల్లో 4 లేదా 5 స్థానాల్లో నేను బ్యాటింగ్ చేస్తే పూర్తిగా రాణించలేను. సచిన్ కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తే అతడు చేసిన పరుగుల్లో సగమే చేసేవాడేమో. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సెహ్వాగ్‌ను బ్యాటింగ్ చేయమని చెప్పా" అని గంగూలీ అన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా
టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా లెజండరీ సునీల్ గవాస్కర్‌ను ఉత్తమ ఓపెనర్‌గా పరిగణిస్తామని, అయితే, అతడితో పోలిస్తే సెహ్వాగ్ ఏమంత వెనుకబడి లేడని గంగూలీ పేర్కొన్నాడు. "గవాస్కర్‌ను భారత ఉత్తమ ఓపెనర్‌గా పరిగణిస్తాం. సెహ్వాగ్ కూడా అతడికి ఏ మాత్రం తీసిపోడు. వారిద్దరి బ్యాటింగ్ శైలి వేరు" అని అన్నాడు.

ఆఫ్ స్టంప్ అవతలికి పంపిస్తే
"ఆఫ్ స్టంప్ అవతలికి పంపిస్తే బంతి పాత పడుతుందని ఒకరు అనుకుంటారు. మరొకరు బంతిని పాత పడే వరకు బాదుతుంటారు. కానీ, వారిద్దరు బ్యాటింగ్ మ్యాచ్‌పై గొప్ప ప్రభావం చూపిస్తుంది" అని గంగూలీ తెలిపాడు. గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications