Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB: డిఫెన్స్ చేయడానికి టెస్టు మ్యాచ్ కాదు కోహ్లీ.. ఇది టీ20!!

Not a Test match, Its T20: Kevin Pietersen asks Virat Kohli to play big shots in nets

దుబాయ్: యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్లాన్ చేసింది. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గత ఆదివారం నుంచే నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.

డిఫెన్స్ చేయడానికే ప్రాధాన్యత

డిఫెన్స్ చేయడానికే ప్రాధాన్యత

బెంగళూరు టీమ్‌తో కలిసి ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌ని కొనసాగిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదు నెలల తర్వాత బ్యాట్ పట్టిన కోహ్లీ.. తొలుత బంతిని డిఫెన్స్ చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చాడు. ప్రాక్టీస్ మొదటలో భారీ షాట్లు ఆడలేదు. వికెట్లపైకి దూసుకొస్తున్న బంతులను కూడా డిఫెన్స్ చేశాడు. 'నిజంగా చెబుతున్నా. తొలి బంతి ఆడే ముందు కాస్త భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే గత ఐదు నెలలుగా నేను అసలు బ్యాటే పట్టలేదు. అయితే ప్రాక్టీస్‌ మాత్రం ఆశించినదానికంటే అద్భుతంగానే సాగింది' అని ప్రాక్టీస్ అనంతరం తాజాగా కోహ్లీ చెప్పాడు.

కోహ్లీ బంతిని హిట్ చేయ్

కోహ్లీ బంతిని హిట్ చేయ్

యూఏఈలో తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబందించిన ఓ ఫొటోని తాజాగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కామెంట్ చేశాడు. 'కోహ్లీ బంతిని హిట్ చేయ్. ఇది టీ20 మ్యాచ్.. టెస్టు కాదు' అని పీటర్సన్ పంచ్ వేశాడు. పీటర్సన్, కోహ్లీలు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. నిజానికి కోహ్లీ భారీ హిట్టర్ తరహాలో ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి తరలించడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా షాట్లు ఆడుతుంటాడు. అందుకే ఇప్పుడు ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

480 ఫోర్లు, 190 సిక్సర్లు

480 ఫోర్లు, 190 సిక్సర్లు

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లాడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,412 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 113. అతని ఇన్నింగ్స్‌ల్లో 480 ఫోర్లు, 190 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే.

పెద్ద లోటు అదే

పెద్ద లోటు అదే

ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, క్రిస్ గేల్, డేల్ ‌స్టెయిన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అదే ఇప్పుడు కోహ్లీకి పెద్ద లోటు.

IPL 2020 schedule‌ విడుదల నేడే.. అసలు ట్వీస్ట్ ఏంటంటే?!!

Story first published: Friday, September 4, 2020, 13:03 [IST]
Other articles published on Sep 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+