ICC Player of the Month : ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం రేసులో ఉన్నది వీళ్లే!

ప్రస్తుతం జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో ప్రత్యర్థులతో ఒంటరిగానే పోరాడుతూ.. తమ జట్ల విజయం కోసం కష్ట పడుతున్న ముగ్గురు ఆటగాళ్లు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు రేసులో నిలిచారు. అక్టోబర్ నెల కోసం పురుషుల, మహిళల విభాగాల్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీల వివరాలను అంత్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. అక్టోబరు నెలలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ, డేవిడ్ మిల్లర్, సికందర్ రజా ఈసారి పోటీలో ఉన్నారు. సెప్టెంబరు నెలలో ఈ అవార్డు పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌కు దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి ఈ అవార్డు ఎవరికి దక్కుతుందో చూడాలి.

విరాట్ కోహ్లీ
ప్రస్తుతం బెస్ట్ ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. పొట్టి ప్రపంచకప్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా రాణించాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచులు ఆడిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అంతేకాదు, కేవలం ఒక్కసారి మాత్రమే అవుటయ్యాడు. ఓవరాల్‌గా అక్టోబరులో కేవలం టీ20ల్లోనే కోహ్లీ 205 పరుగులు చేశాడు. అంతేకాదు ఈ టైంలో అతని సగటు కూడా 205 కాగా, స్ట్రైక్ రేట్ కూడా 150.73గా ఉంది.

డేవిడ్ మిల్లర్
సౌతాఫ్రికా మిడిలార్డర్‌కు వెన్నెముకలా మారాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. ఈ ఏడాది ఆరంభం నుంచే మంచి ఫామ్‌లో ఉన్న మిల్లర్.. అక్టోబరు నెలలో మరో గేరు మార్చాడు. భారత్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు పరాజయం చవి చూసినా.. మిల్లర్ ఇన్నింగ్స్ మాత్రం అందరి మెప్పూ పొందింది. ప్రపంచకప్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్న అతను.. మళ్లీ భారత్‌పైనే ప్రతాపం చూపించాడు. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు విజయాన్నందించాడు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్ ఓడింది ఈ మ్యాచ్‌లోనే కావడం గమనార్హం. వన్డేలు, టీ20లు కలిపి మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన మిల్లర్.. ఆరు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ నెల రోజుల్లో 303 సగుటు, 146.37 స్ట్రైక్ రేటుతో 303 పరుగులు సాధించాడు.

సికందర్ రజా
వన్ మ్యాన్ ఆర్మీకి అసలు సిసలు నిదర్శనంగా నిలిచాడీ జింబాబ్వే ఆల్‌రౌండర్. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రపంచకప్‌లో తన జట్టును ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. అక్టోబర్ నెల ఆరంభంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 82 పరుగులు బాదాడీ వెటరన్ ఆల్‌రౌండర్. అదే మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ వచ్చాడు. స్కాట్లాండ్‌పై కూడా 40 పరుగులు చేసి, ఒక వికెట్ తీసుకున్నాడు. వెస్టిండీస్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో బ్యాటుతో రాణించలేకపోయిన రజా.. బంతితో మాత్రం ఆ జట్లకు వణుకు పుట్టించాడు. వెస్టిండీస్‌పై 19 పరుగులిచ్చి 3 వికెట్తు తీసుకోగా, పాక్‌పై 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications