ఆస్ట్రేలియాపై గెలిచినా.. సెలబ్రేషన్స్‌కి ధోనీ నో..

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో దిట్ట. పగ్గాలు చేపట్టిన కొత్తలోనే అటు సీనియర్లు, ఇటు జూనియర్లను ఏకతాటిపై నడిపించి తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ముఖ్యంగా.. జట్టు ఓడే స్థితిలో ఉన్నా.. ఈ కూల్ కెప్టెన్.. ఎప్పుడూ ఆటగాళ్ల ఆత్మస్థైర్యం మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తపడేవాడు. ఈ లక్షణాలే అతడ్ని ప్రపంచంలోనే విజయవంతమైన కెప్టెన్స్ జాబితాలో నిలిపింది. తాజాగా ధోనీ కెప్టెన్సీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

‘ధోనీ టచ్’ అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చాడు
సుదర్శన్ అనే రచయిత ఇటీవల రాసిన ‘ధోనీ టచ్' అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చాడు. 2008లో ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఓడించినపుడు అతిగా స్పందించవద్దని సహచరులందరికీ సంకేతాలిచ్చాడట ధోని. అప్పటికి ధోని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ అందుకుని కొన్ని నెలలే అయింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను భారత్.. 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

మరి కొన్ని నిమిషాల్లో ఛేదన పూర్తి కాబోతుండగా..
మొదట ఆసీస్ 159 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్యాన్ని 5 వికెట్లే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఐతే మరి కొన్ని నిమిషాల్లో ఛేదన పూర్తి కాబోతుండగా.. బ్యాటింగ్ చేస్తున్న ధోని గ్లోవ్స్ మార్చుకోవడం కోసం ఓ సహచరుడిని మైదానంలోకి పిలిచాడట. ఛేదన పూర్తయ్యాక డగౌట్‌లో ఉన్న వాళ్లు ఎగిరి గంతులేయొద్దని చెప్పాడట. అలాగే తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు సైతం మ్యాచ్ పూర్తయ్యాక మామూలుగానే ఉండమని, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసంతో కరచాలనం చేయమని సూచించాడట.

భారత్ వన్డే గెలిచినా.. హుందాగా
కెప్టెన్ ఆదేశంతో భారత్ జట్టు వన్డే సిరీస్ గెలిచినా.. హుందాగా వ్యవహరించింది. అప్పటి వరకు క్రికెట్ ప్రపంచంలో అజేయ జట్టుగా భావిస్తూ.. విర్రవీగిన ఆస్ట్రేలియాను ఓడించడం అసాధ్యంకాదని తెలియజెప్పడం, ఇకపై కూడా ఓడించగలమనే సంకేతాలు ఇవ్వడానికే ధోనీ అలా చేశాడు.

క్రమంగా ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యానికి తెరపడుతూ
అసాధ్యాలంటూ ఏవీ ఉండవని.. బాగా ఆడితే ఎవరినైనా ఓడించొచ్చని జట్టులోని ఆటగాళ్లకి చెప్పి ధోనీ.. ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లకి కరచాలనం చేసి తెలియజేయాలని సూచించాడట. ఈ సిరీస్ తర్వాత.. క్రమంగా ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యానికి తెరపడుతూ వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications