Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ్యూహాల్లో దిట్ట: ధోని గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పిన కోహ్లీ

హైదరాబాద్: మాజీ కెప్టెన్ ధోనికి, నాకు మధ్య విభేదాలంటూ ఎవరైనా మాట్లాడితే నవ్వుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోనితో తమ అనుబంధం ఎంతో దృఢమైందని.. ఎవరేం మాట్లాడినా.. ఏం రాసినా తమ బంధాన్ని ప్రభావితం చేయలేరని కోహ్లీ స్పష్టం చేశాడు.

తన 29వ పుట్టినరోజు సందర్భంగా 'బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' వెబ్‌ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'ధోనికి, నాకు మధ్య విభేదాలున్నట్లుగా చాలామంది కథలు అల్లుతుంటారు. మేమిద్దరం చేసే ఉత్తమమైన పనేంటంటే.. వాటిని చదవం. తిరిగి మేం అన్యోనంగా కనిపించేసరికి ఆశ్చర్యపోతుంటారు. ఏళ్లు గడిచేకొదద్దీ మా బంధం మరింత బలపడుతూ వచ్చింది' అని కోహ్లీ చెప్పాడు.

 ధోనిలో చిన్న పిల్లాడి ఉత్సాహం

ధోనిలో చిన్న పిల్లాడి ఉత్సాహం

'ధోనిలో చిన్న పిల్లాడి ఉత్సాహం ఉంటుంది. చాలా సంగతులను ధోని కుతూహలంగా తెలుసుకుంటారు. కొత్తవాటి పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఓసారి ధోనీకి నా అండర్‌-17 రోజుల్లో జరిగిన సంగతి చెప్పా. నేను

అండర్‌-17 రోజుల్లో నేను ప్రాతినిధ్యం వహించే అకాడమీ తరఫున మ్యాచ్‌కు ఓ కొత్త కుర్రాడు వచ్చాడు. నేను అతను ఏ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని (ఏ ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేస్తావు) అని అడిగా.

అందుకు ఆయన నజఫ్‌గఢ్‌ నుంచి భయ్యా అన్నాడు. ఇది విని ధోని గట్టిగా నవ్వాడు' అని చెప్పాడు.

 ఆటను అంచనా వేయడంలో ధోని దిట్ట

ఆటను అంచనా వేయడంలో ధోని దిట్ట

'ధోనిలా క్రికెట్‌ నాలెడ్జి ఉన్న మరొకరిని నేను చూడలేదు. ఆటలో ఏం జరుగుతోందో అంచనా వేయడంలో అయినా.. పరిస్థితులకు తగ్గట్లు ఏం చేయాలనే విషయంలో అయినా ధోనిని మించిన మేధావిని నా కెరీర్లో చూడలేదు. నేను నా ఆలోచనలకు తగ్గట్లే నిర్ణయాలు తీసుకుంటా కానీ.. అవసరమైనపుడు ధోని సలహా తీసుకుంటాను. నేను పది సార్లు నా ఆలోచనలు పంచుకుంటే దాదాపు ఎనిమిది సార్లు అవి పనిచేస్తాయని చెప్తారు. కాలం గడిచే కొద్దీ మా మధ్య స్నేహం మరింత దృఢమైంది' అని కోహ్లీ అన్నాడు.

 ధోనితో నాకు చక్కటి సమన్వయం ఉంటుంది

ధోనితో నాకు చక్కటి సమన్వయం ఉంటుంది

'ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు తీసేటపుడు ధోనితో నాకు చక్కటి సమన్వయం ఉంటుంది. అతను రెండు పరుగులు తీద్దాం అంటే కళ్లు మూసుకుని పరుగెత్తేస్తా. ఎందుకంటే తన నిర్ణయం సరిగ్గా ఉంటుందని నాకు తెలుసు. మైదానంలో ఆటగాళ్లెవ్వరూ కూడా ఏదో మార్పు జరిగిన భావనకు లోనవలేదు. అంత సాఫీగా ఈ మార్పు జరిగింది. ధోనీ కెప్టెన్సీలో ఆడినందుకు గర్విస్తున్నా. కెప్టెన్‌గా నా తొలి రోజుల్లో ధోని జట్టులో ఉండటం నా అదృష్టం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 హార్దిక్‌ది స్వచ్ఛమైన మనసు

హార్దిక్‌ది స్వచ్ఛమైన మనసు

ఇక, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌లోని చతురత గురించి కూడా విరాట్ కోహ్లీ వివరించాడు. 'ప్రస్తుత భారత జట్టులో హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌ చాలా సరదాగా ఉండే వ్యక్తులు. హార్దిక్‌ది స్వచ్ఛమైన మనసు. తనకేదనిపిస్తే అది చేస్తాడు. పాండ్యా ఐపాడ్‌లో అన్నీ ఇంగ్లిష్‌ పాటలే ఉంటాయి. కానీ అందులోని నాలుగైదు పదాలు కూడా అతడికి తెలియవు. కానీ ఆ పాటల్లోని బీట్‌ కోసం వింటూ ఉంటాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

 ఇక, రోహిత్ శర్మ గురించి

ఇక, రోహిత్ శర్మ గురించి

రోహిత్‌ శర్మ ఓ విచిత్రమైన వ్యక్తి. అతను ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాడు. ఐపాడ్‌, వాలెట్‌, ఫోన్‌ ఇలా ఏదో ఒక వస్తువు పోగొట్టుకున్నాడు. అయితే వస్తువు పోగొట్టుకున్న తర్వాత రోహిత్ శర్మలో ఆందోళన కనిపించదు. ఇంకోటి కొనుక్కుందాంలే అని అంటాడు. చెప్పాలంటే... రోహిత్‌ రెండు మూడు సార్లు పాస్‌పోర్ట్‌‌ని కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+