అసంతృప్తి: కోహ్లీని ఎలా మర్చిపోతారని ఠాకూర్ ప్రశ్న
హైదరాబాద్: గురువారం ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కోహ్లీకి చోటు దక్కకపోవడంపై కూడా ఠాకూర్ స్పందించారు.
భారత్‌కు వరుస విజయాలు అందిస్తున్న ఆటగాడిని ఎలా మర్చిపోతారని ప్రశ్నించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో ఉందన్న విషయాన్ని ఐసీసీ గమనించాలన్నారు. టెస్టు జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఒకసారి ఐసీసీ పరీశీలిస్తే బాగుండేదని అనురాగ్ సూచించారు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అటు స్వదేశంతో పాటు విదేశాల్లో కలిపి ఇప్పటివరకు 18 వరుస టెస్టుల్లో విజయం సాధించిందన్నారు. టెస్టు ర్యాంకుల్లో సైతం భారత్ నంబర్ వన్‌గా ఉందనే విషయం గుర్తు చేశారు. నెంబర్ వన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తికి టెస్టు జట్టులో స్థానం దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా సమీక్షించాలి
'టెస్టు జాబితాను ప్రకటించే ముందు మారిన పరిస్థితులను ఐసీసీ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బాగుండేదనేది నా భావన. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ ఆటగాళ్లు ప్రదర్శన కాకుండా, గత జనవరి నుంచి వచ్చే జనవరి వరకూ ఆటగాళ్ల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. దాంతో పాటు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా సమీక్షించాలి' అని ఠాకూర్ పేర్కొన్నారు.

టెస్టు జట్టులో కోహ్లీకి చోటు లభించకపోవడం బాధాకరం
టెస్టుల్లో భారత జట్టు నెంబర్ వన్ జట్టుగా ఉండి, ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో చోటు లభించకపోవడం బాధాకరం. కాకపోతే ఐసీసీ వన్డే కెప్టెన్‌గా కోహ్లిని ఎంపిక చేయడం మాత్రం నిజంగా శుభవార్తే. రాబోయే సీజన్‌లో ఐసీసీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత జట్టులను ప్రకటిస్తుందని అనుకుంటున్నా' అని తెలిపారు.

అశ్విన్‌కు టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
అయితే ఐసీసీ అవార్డుల్లో అశ్విన్‌కు టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడంపై ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, కోహ్లీకి టెస్టు జట్టులో చోటు లభించకపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వివరణ ఇచ్చింది. 2015, సెప్టెంబర్ 14 నుంచి 2016, సెప్టెంబర్ 20 మధ్య ప్రదర్శన ఆధారంగా జరిగిన ఓటింగ్ ద్వారా అవార్డులను ప్రకటించామని పేర్కొంది.

8 టెస్టులాడిన కోహ్లీ 45.10 సగటుతో 451 పరుగులు
ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లాడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు.

జో రూట్ 14 టెస్టు మ్యాచ్‌లాడి 55.30 సగటుతో 1272 పరుగులు
అదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 14 టెస్టు మ్యాచ్‌లాడి 55.30 సగటుతో 1272 పరుగులు సాధించాడు. ఇందులో 9అర్ధ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. దాంతో మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి ఆ ఏడాదిని (ఐసీసీ పరిగణలోకి తీసుకున్న సమయం ప్రకారం) ఘనంగా ముగించాడు.

ఆ తర్వాత రెండు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ
ఇక కోహ్లీ ఏడాది సెప్టెంబర్ తర్వాత రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ, ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో కూడా డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రెండు టెస్టు సిరీస్‌ల్లో 80.33 సగటుతో 964 పరుగులు చేశాడు. ఐసీసీ టెస్టు జట్టును క్రికెట్ మాజీ దిగ్గజాలైన రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, గ్యారీ కిరెస్టన్‌లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications