నో విలన్స్, సీక్వెల్ తీస్తే అందరూ విలన్లే: ధోనీ
న్యూఢిల్లీ: తన జీవితంలో విలన్లు లేరని భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. తన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎమ్మెస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ' సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు.
తన జీవితంలో విలన్లు లేరని చెప్పాడు. దీంతో ఈ సినిమాలో విలన్ పాత్రలు ఉండవని ఆయన పరోక్షంగా స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తీయడం లేదని, అలా తీయాల్సి వస్తే మొత్తం విలన్లే ఉండాల్సి వస్తుందని అన్నాడు.
ప్రపంచ కప్ తర్వాత తన జీవితంలో విమర్శలు తప్ప ఇంకేమీ లేవని, దీంతో మూవీకి సీక్వెల్ తీయాల్సి వస్తే అప్పుడు సినిమాలో ఎక్కవగా విలన్లే ఉంటారని చెప్పాడు ధోనీ. ధోనీ బాల్యంతో సినిమా ప్రారంభమై 2011లో ప్రపంచ కప్‌ను సాధించిన విజయంతో ముగుస్తుందని అంటున్నారు.

ధోనీ సన్నిహిత మిత్రుడు అరుణ్ పాండే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో చాలా సమాచారం ఉంటుందని ధోనీ చెప్పాడు. తన సొంత ఊరైన రాంచి వారికి కూడా తాను ఖరగ్‌పూర్‌లో ఏం చేశాననేది తెలియదని అన్నాడు.
తాను నాలుగేళ్ల పాటు అక్కడ ఉన్నానని చెప్పాడు. తాను క్రీడలకు ప్రాముఖ్యత లేని కాలంలో 1981లో పుట్టానని, అయితే తనపై కుటుంబం ఒత్తిడి లేదని చెప్పాడు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల అవుతోంది. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5500కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో 4500, విదేశాల్లో 1000 స్క్రీన్లలో మూవీ రిలీజ్ అవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications