న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ విషయంలో బీసీసీఐకి మద్దతివ్వను: గంగూలీ

No uncertainty over India-West Indies first Twenty20: Sourav Ganguly

న్యూ ఢిల్లీ: భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న రెండో వన్డే వేదిక చర్చనీయాంశంగా ముగిసింది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టేడియాన్ని వేదికగా ఖరారు చేయడంతో సద్దుమణిగినట్లే. కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం కారణంగా భారత్‌-విండీస్‌ రెండో వన్డే ఇండోర్‌ నుంచి తరలిపోవడంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ తీరును అతను తప్పుబట్టాడు.

క్రికెట్‌ సంఘానికే పూర్తి మద్దతు

క్రికెట్‌ సంఘానికే పూర్తి మద్దతు

బోర్డు తీరు ఇలాగే ఉంటే రాష్ట్ర సంఘాలు మ్యాచ్‌లు నిర్వహించడం కష్టమని అతను అభిప్రాయపడ్డాడు. ‘ఈ వివాదంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘానికే నా పూర్తి మద్దతు. వారి ఇబ్బందులేంటో నాకు తెలుసు. మ్యాచ్‌ల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. పోలీసులు చాలా నామమాత్రంగా ఫీజు తీసుకుని రక్షణ కల్పిస్తారు. ఇంకా మరెందరో సాయపడతారు. వాళ్లందరికీ మేం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాలి. టికెట్లు కొనుక్కోమని వారికి మేం చెప్పలేం.'

బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో

బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో

'ఇంకా మా సంఘాలకు అనుబంధంగా ఉన్న వాళ్లెందరికో పాస్‌లు ఇవ్వాలి. కాంప్లిమెంటరీల విషయంలో బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదు. మ్యాచ్‌ను తరలించాలనుకుంటే తరలించనివ్వండి. మేమైతే ఈ విషయంలో రాజీ పడం' అని గంగూలీ అన్నాడు. సౌరభ్‌ ఇలా అన్న నేపథ్యంలో నవంబరు 4న కోల్‌కతాలో జరగాల్సిన భారత్‌-విండీస్‌ టీ20 విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఐతే ఆ మ్యాచ్‌ యథావిధిగా జరుగుతుందని గంగూలీ చెప్పాడు.

పృథ్వీషా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని

పృథ్వీషా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని

వెస్టిండిస్‌తో గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో యువ ఆటగాడు పృథ్వీషా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తొలి టెస్టు నేపథ్యంలో బుధవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ తొలి టెస్టులో ఆడే 12 మంది జట్టు సభ్యులను ప్రకటించాడు.

టాపార్డర్‌లో మార్పులు.. స్వేచ్ఛగా ఆడేందుకు

టాపార్డర్‌లో మార్పులు.. స్వేచ్ఛగా ఆడేందుకు

తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌తో కలిసి పృథ్వీషా ఓపెనింగ్‌కు దిగనున్నాడని కోహ్లీ తెలిపాడు. అంతేకాదు ఇప్పటి వరకు టాపార్డర్‌లో బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయలేదని ఇకపై యువకులకు కావాల్సినన్ని అవకాశాలు ఇస్తామని కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ "టాపార్డర్‌లో మార్పులు చేశాం. ఈ స్థానంలో స్వేచ్ఛగా ఆడేందుకు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలిస్తాం" అని అన్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 9:20 [IST]
Other articles published on Oct 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X