చెదిరిన ఉసేన్ బోల్ట్ ‘ట్రిపుల్ ట్రిపుల్’ రికార్డు: బీజింగ్ స్వర్ణం వెనక్కి
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో 'ట్రిపుల్ ట్రిపుల్'తో చరిత్ర సృష్టించిన జమైకన్ స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ రికార్డు చెదిరింది. ఉసేన్ బోల్ట్ గెలిచిన తొమ్మిది స్వర్ణాల్లో ఒకటి వెనక్కి తీసుకోనున్నారు. దీంతో ఉసేన్ ఒలింపిక్ స్వర్ణాల సంఖ్య తొమ్మిది నుంచి ఎనిమిదికి తగ్గనుంది.
2008 బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో బోల్ట్‌తో కలిసి 4X100 మీటర్ల రిలే రేసు బరిలోకి దిగిన జమైకా బృందంలోని అథ్లెట్ నెస్టా కార్టర్ డోపింగ్‌లో దొరికిపోయాడు. వాడా నిషేధిత జాబితాలో ఉన్న మిథైల్‌ఎక్సామైన్‌ను కార్టర్ తీసుకున్నట్లు కొత్త టెక్నాలజీతో జరిపిన పరీక్షల్లో బయటపడిందని ఐఓసీ ప్రకటించింది.

దీంతో బోల్ట్ తన బృందంతో కలిసి గెలిచిన రిలే స్వర్ణాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో కలిపి 9 స్వర్ణాలతో ఉన్న బోల్ట్ ఖాతాలో ఇకనుంచి 8స్వర్ణాలే ఉండనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications