IPL 2020: డాడీ.. ఎవరినీ ముట్టుకోవద్దు, ఎవరికీ ముద్దివ్వొద్దు!!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరుగనుంది. లీగ్‌కి సమయం దగ్గర పడటంతో అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు పంపిస్తున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకోగా.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం బయల్దేరనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ వారాంతంలో పయనం కానున్నాయి.
కుటుంబ సభ్యుల జాగ్రత్తలు:
కరోనా వైరస్ ముప్పు పొంచి వుండటంతో ఆటగాళ్లు అందరూ అన్ని జాగ్రత్తలతో విమానం ఎక్కుతున్నారు. ఇప్పటికే ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయించుకున్న ఆటగాళ్లు పీపీఈ కిట్లు ధరించి.. శానిటైజర్లు, సబ్బులను వెంటతీసుకెళుతున్నారు. అయితే క్రికెటర్లు ఇంటినుండి బయలుదేరేటప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా పలు జాగ్రత్తలు చెప్పారు. ఇంటినుండి వచ్చేప్పుడు టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అతడి ముద్దుల కుమార్తెలు ముద్దుముద్దుగా మాట్లాడుతూ పలు జాగ్రత్తలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను అశ్విన్ సతీమణి ప్రీతి ట్విటర్లో పోస్ట్ చేశారు.

డాడీ.. దేనినీ ముట్టుకోవద్దు:
వీడియోలో ఆర్ అశ్విన్ కుమార్తెలు మాట్లాడుతూ... 'డాడీ.. దేనినీ ముట్టుకోవద్దు' అని సూచించారు. ఆ పక్కనే ఉన్న అశ్విన్ సతీమణి ప్రీతి.. ఎవరినీ ముద్దు పెట్టుకోవద్దని పిల్లకు చెప్పగా.. వారి అలానే అశ్విన్‌కు చెప్పారు. ఆ మాటలు విన్న అశ్విన్.. సరేనమ్మా అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ అశ్విన్ కుమార్తెలు చెప్పిన మాటలకు ఫిదా అవుతున్నారు.

ఈ సారి ఢిల్లీకి:
గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథ్యం వహించిన ఆర్ అశ్విన్‌ను ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అమిత్ మిశ్రాతో పాటు మరో సీనియర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని భావించి.. బదిలీ రూపంలో దక్కించుకుంది. ఢిల్లీ అరుణ్‌జైట్లీ మైదానంలానే.. ఇప్పుడు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇస్తున్న యూఏఈ పిచ్‌లు సైతం స్పిన్‌కు బాగా అనుకూలిస్తాయి. అంతర్జాతీయ కెరీర్‌లో అశ్విన్ ఇప్పటివరకు 71 టెస్టుల్లో, 111 వన్డేల్లో, 46 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్ 12లో పెద్ద దుమారమే:
ఐపీఎల్ 12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన 'మన్కడింగ్' పెద్ద దుమారమే లేపింది. మన్కడింగ్ ద్వారా జాస్ బట్లర్‌ను రనౌట్ చేయడంపై కొందరు మద్దతుపలకగా.. మరికొందరు దుమ్మెత్తిపోశారు. అయితే తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడ్డాడు. అయితే ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో అశ్విన్‌తో గట్టిగా మాట్లాడతానని ఢిల్లీ హెడ్ కోచ్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంటున్నాడు.
వైరల్ వీడియో: ఐపీఎల్ వచ్చేస్తోంది.. కాస్త బరువు తగ్గించు మిత్రమా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications