Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'భారత్‌తో పోరాడి ఒక్క జట్టు కూడా గెలవలేదు'

No team stands in competition with India: Surinder Khanna

హైదరాబాద్: సఫారీ జట్టుతో పోరాడి రెండు వన్డేలను భారత జట్టు ఘనంగా గెలిచింది. సఫారీ గడ్డపై అదే జట్టు ఆటగాళ్లను స్పిన్ మాయాజాలంతో చుట్టేసింది. దీంతో భారత్ జట్టుపై ప్రశంసల వెల్లువ మొదలైంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో భారత్ జోరు చూస్తుంటే ప్రపంచంలోని ఏ జట్టూ ప్రస్తుతం పోటీనివ్వలేదేమో అని భారత మాజీ క్రికెటర్ సురేందర్ ఖన్నా అభిప్రాయపడ్డారు.

India vs South Africa : How India Crush South Africa by 9 Wickets

సెంచూరియన్ వేదికగా బుధవారం ముగిసిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టుని 118 పరుగులకే టీమిండియా ఆలౌట్ చేసింది. స్వల్ప లక్ష్యాన్ని కేవలం 20.3 ఓవర్లలోనే ఛేదించేసి ఆరు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్‌తో జట్టుకి ముందుండి విజయాల్ని అందిస్తున్నాడని సురేందర్ ప్రశంసించారు.

'దక్షిణాఫ్రికా గడ్డపై వారినే భారత్ మట్టికరిపించిన తీరు అద్భుతం. రెండు వన్డేలోనూ చాహల్, కుల్దీప్ యాదవ్ మెరుగ్గా బౌలింగ్ చేశారు. దీనికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్‌తో ముందుండి జట్టుని నడిపిస్తుండటం నన్ను సంతోషపరుస్తోంది. అతను పరుగులు సాధిస్తుంటే.. టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుంది.' అని వ్యాఖ్యానించాడు.

'సఫారీ గడ్డపై భారత్ ఆడుతున్న తీరు చూస్తుంటే.. ప్రపంచంలోని ఏ జట్టూ కోహ్లిసేనకి పోటీనివ్వలేదేమో అనిపిస్తోంది' అని సురేందర్ ఖన్నా వెల్లడించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. ఆదివారం జరిగిన రెండో వన్డే విజయంతో భారత్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 13:37 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+